ANKURARPANAM OF SKVST BRAHMOTSAVAMS_ శాస్త్రోక్తంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
Srinivasa Mangapuram, 23 Feb. 19: As part of Annual Brahmotsavams of Sri Kalyana Venkateswara Swamy Temple of Srinivasa Mangapuram the holy ritual of Ankurarpanam was performed grandly on Saturday evening.
Earlier Viswaroopa darshan, Mrutsan grahanam and Senadhipati utsava were performed prior to Ankurarpanam.
DWAJAROHANAM ON FEB 24
The sacred ritual of Dwajarohanam will be performed in morning to be followed by Tiruchi utsava for Ammavari and Swamy. The TTD has cancelled all arjita Sevas in view of annual Brahmotsavams.
Major events of the Brahmotsavams are dwajarohanam on Sunday, February 24. Garuda Vahanam on February 28, Rathotsavam on March 3 and Chakrasnanam on March 4.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
శాస్త్రోక్తంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
తిరుపతి, 2019, ఫిబ్రవరి 23: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు శనివారం సాయంత్రం వైభవంగా అంకురార్పణ జరిగింది.
అంకురార్పణం సందర్భంగా శనివారం తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి విశ్వరూప దర్శనం కల్పించారు. సాయంత్రం 6.00 నుండి 8.00 గంటల వరకు మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం అనంతరం శాస్త్రోక్తంగా బ్రహ్మోత్సవాలకు అంకురార్పణం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ ధనంజయులు, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ లక్ష్మయ్య, సూపరింటెండెంట్ శ్రీ రమణయ్య, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ అనిల్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఫిబ్రవరి 24న ధ్వజారోహణం :
ఫిబ్రవరి 24వ తేదీ ఆదివారం ధ్వజారోహణంతో శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 7.00 నుండి 8.00 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు తిరుచ్చి ఉత్సవం జరుగనుంది. ఉదయం 9.00 నుండి 9.18 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణ ఘట్టాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించనున్నారు. అదేరోజు సాయంత్రం సాయంత్రం 6.00 నుండి 7.00 గంటల వరకు ఊంజల్‌సేవ, రాత్రి 8.00 నుండి 9.00 గంటల వరకు పెద్దశేష వాహనసేవ జరుగనున్నాయి.
ప్రతిరోజూ ఉదయం 8.00 నుండి 9.00 గంటల వరకు, తిరిగి రాత్రి 8.00 నుండి 9.00 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాల కారణంగా ఆలయంలో అన్ని రకాల ఆర్జితసేవలను టిటిడి రద్దు చేసింది.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :
24-02-2019(ఆదివారం) ధ్వజారోహణం( మీన లగ్నం) పెద్దశేష వాహనం
25-02-2019(సోమవారం) చిన్నశేష వాహనం హంస వాహనం
26-02-2019(మంగళవారం) సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం
27-02-2019(బుధవారం) కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం
28-02-2019(గురువారం) పల్లకి ఉత్సవం(మోహినీ అవతారం) గరుడ వాహనం
01-03-2019(శుక్రవారం) హనుమంత వాహనం స్వర్ణరథం,గజ వాహనం
02-03-2019(శనివారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
03-03-2019(ఆది వారం) రథోత్సవం అశ్వవాహనం
04-03-2019(సోమవారం) చక్రస్నానం ధ్వజావరోహణం
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.