ANKURARPANAM PERFORMED TO SRI GT BTUs _ శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ‌

Tirupati, 17 May 2021: The Ankurarpana for annual brahmotsavams in Sri Govindaraja Swamy temple in Tirupati was held on Monday evening in connection with the annual brahmotsavams which will commenced from May 18 till May 26.

Dhwajarohanam will be observed on Tuesday, May 18. However, in view of Covid all the nine-day morning and evening Vahana Sevas will be observed in Ekantam only inside the temple premises.

Both the Senior and Junior Pontiffs of Tirumala, Special Grade DyEO Sri Rajendrudu and other officials were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ‌

తిరుపతి, 2021 మే 17: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు ఏకాంతంగా జరుగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు సోమ‌వారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణం జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల, సహస్రనామార్చన నిర్వ‌హించారు. సాయంత్రం 5.00 గంటలకు అంకురార్పణ ఘట్టం ప్రారంభమైంది. ముందుగా ఆలయ ప్రాంగ‌ణంలోనే సేనాధిపతి ఉత్సవం, ముఖ మండ‌పంలో వేంచేపు, స‌మ‌ర్ప‌ణ‌, ఆస్థానం నిర్వహించారు. యాగశాలలో కార్యక్రమాల అనంతరం శాస్త్రోక్తంగా అంకురార్పణం చేపట్టారు.

మే 18న ధ్వజారోహణం :

శ్రీగోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజైన మే 18వ తేదీ మంగ‌ళ‌వారం ఉదయం 7.55 నుంచి 8.30 గంటల మధ్య మిథున లగ్నంలో ధ్వజారోహణం నిర్వ‌హిస్తారు.

క‌రోనా వ్యాధి వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా తొమ్మిది రోజుల పాటు ఉద‌యం, రాత్రి మాడ వీధుల్లో వాహ‌న‌సేవ‌ల ఊరేగింపును ర‌ద్దు చేశారు. ఈ వాహ‌న‌సేవ‌ల‌ను ఆల‌య ప్రాంగ‌ణంలోనే ఏకాంతంగా నిర్వ‌హిస్తారు.

ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, ఆలయ ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ రాజేంద్రుడు, ఏఈవో శ్రీ ర‌వికుమార్‌‌ రెడ్డి, కంక‌ణ బ‌ట్టార్ శ్రీ ఏ.టి. పార్థ‌సార‌ధి దీక్షితులు, సూపరింటెండెంట్లు శ్రీ వెంక‌టాద్రి, శ్రీ కుమార్‌‌, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్లు శ్రీ మునీంద్ర‌బాబు, శ్రీ కామ‌రాజు, అర్చకులు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.