ANKURARPANAM TO PAVITROTSAVAMS OBSERVED_ శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలకు ఘనంగా అంకురార్పణ

Tirumala, 2 August 2017: In connection with three-day annual pavitrotsavams from August 3 to 5, Ankurarpanam was performed in Tirumala temple on Wednesday.

Also known as Beejavapanam, the seed sowing festival was observed with religious fervour in Yagashala between 7pm and 9pm. TTD has cancelled Vasanthotsavam, Sahasradeeplankara Seva in view of Ankurarpanam.

Meanwhile Pavitrotsavams are unique festival observed as “Sin Free” festival to the faults which were committed by archakas either knowingly or unknowingly. Hence it is also known as Sarva Yagna Phalaprada or Sarvadoshopasamana festival also.

The historical evidences says that this festival was performed in 1463 for the first time and was later re introduced by TTD in 1962.

TTD EO Sri Anil Kumar Singhal, Tirumala JEO Sri KS Sreenivasa Raju, Temple DyEO Sri Rama Rao, Peishkar Sri Ramesh and others took part.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలకు ఘనంగా అంకురార్పణ

తిరుమల, 2017 ఆగస్టు 02: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు 3 నుంచి 5వ తేదీ వరకు జరుగనున్న పవిత్రోత్సవాలకు బుధవారం రాత్రి 9 నుంచి 10 గంటల నడుమ ఘనంగా అంకురార్పణం జరుగనుంది. ఈ సందర్భంగా రాత్రి 7.00 నుంచి 9.00 గంటల వరకు సేనాధిపతివారిని వసంతమండపానికి వేంచేపు చేసి మృత్సంగ్రహణం, ఆస్థానం నిర్వహిస్తారు. ఆ తరువాత పవిత్రమండపంలోని యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ కారణంగా వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.

ఆచార్య రుత్విక్‌వరణం :

పవిత్రోత్సవాల అంకురార్పణం సందర్భంగా బుధవారం ఉదయం 5 నుంచి 6 గంటల నడుమ శ్రీవారి మూలవిరాట్‌ ఎదుట ఆచార్య రుత్విక్‌వరణం నిర్వహించారు. అర్చకులకు విధుల కేటాయింపునే రుత్విక్‌వరణం అంటారు. యాగకర్మలు, పుణ్యాహవచనం, హోమాలు తదితర వైదిక కార్యక్రమాల నిర్వహణ కోసం ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యతలు అప్పగిస్తారు. సాక్షాత్తు శ్రీవారి ఆజ్ఞ మేరకు తాము విధులు పొందినట్టు అర్చకులు భావిస్తారు.

పవిత్రోత్సవాల్లో భాగంగా మొదటిరోజు పవిత్ర ప్రతిష్ఠ, రెండో రోజు పవిత్ర సమర్పణ, చివరిరోజు పూర్ణాహుతి నిర్వహిస్తారు. శ్రీవారి ఆలయంలో సంవత్సర కాలంలో తెలిసీతెలియక వివిధ కైంకర్యాల్లో చోటుచేసుకున్న దోషాల నివారణకు పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాన్ని ‘దోష నివారణ’, ‘సర్వయజ్ఞ ఫలప్రద’, ‘సర్వదోషోపశమన’, ‘సర్వతుష్టికర’, ‘సర్వకామప్రద’ తదితర పేర్లతో పిలుస్తారు. పవిత్రం, ఉత్సవం అనే రెండు పదాల కలయిక వల్ల పవిత్రోత్సవం ఏర్పడింది. చారిత్రక ఆధారాల ప్రకారం శ్రీస్వామివారి ఉత్సవమూర్తులకు కావలసిన పవిత్రాలు చేయడానికిగాను శ్రేష్ఠమైన జాతి పత్తి మొక్కలను అత్యంత పవిత్రమైన దైవమొక్కగా భావించే తులసి పెంచడానికి ఉపయోగించే పెరటి భూమిలో పెంచడం విశేషం.

పవిత్రాలను తయారు చేయడానికి 20 మూరల పట్టుదారంగానీ లేదా 200 మూరల నూలుదారం గానీ ఉపయోగిస్తారు. ఈ దారాలకు తెలుపుతో పాటు నలుపు, ఎరుపు, ఆకుపచ్చ, పసుపుపచ్చ రంగులు అద్దకం చేస్తారు. తిరుమల శ్రీవారి ఆలయంలో క్రీ.శ.1463వ సంవత్సరం నుంచి పవిత్రోత్సవాలు జరిగినట్టు శాసనాల ద్వారా స్పష్టమవుతోంది. ఆలయ మొదటి ప్రాకారంలో గల వగపడి వరండాలో ఉత్తరం వైపున రాతి గోడపై పవిత్రోత్సవాల లెక్కలకు సంబంధించిన శాసనం లభ్యమైంది. ”పవిత్ర తిరునాల్‌” పేరిట నిర్వహించిన ఈ ఉత్సవాల్లో ఉపయోగించిన వస్తువుల జాబితా, వాటి ధరల వివరాలున్నాయి. క్రీ.శ.1562 తరువాత ఆనాటి పరిస్థితుల కారణంగా ఈ ఉత్సవం ఆగిపోయింది. 1962లో పవిత్రోత్సవాలు తిరిగి ప్రారంభమయ్యాయి.

ఈ ఉత్సవాల నేపథ్యంలో ఆగస్టు 3 నుంచి 5వ తేదీ వరకు తిరుప్పావడ సేవ, నిజపాద దర్శనం, కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌సేవ, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది. ఆయా రోజుల్లో ఆర్చన, తోమాల సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.