ANNAMACHARYA JAYANTI FESTIVITIES _ ఘనంగా శ్రీ తాళ్లపాక అన్నమయ్య 615వ జయంతి ఉత్సవాలు ప్రారంభం

TIRUPATI, 06 MAY 2023: The 615th Jayanti of Saint Poet Sri Tallapaka Annamacharya commenced on a grand scale at Annamacharya Kalamandiram in Tirupati on Saturday.

The artists presented Sapthagiri Sankeertans on the occasion while in the evening there will be Harikatha Parayanam by Smt Sarada and her team from Madanapalle.

Annamacharya Project Director Dr Vibhishana Sharma and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఆకట్టుకున్న అన్నమయ్య సంకీర్తనల గోష్టిగానం

ఘనంగా శ్రీ తాళ్లపాక అన్నమయ్య 615వ జయంతి ఉత్సవాలు ప్రారంభం

తిరుపతి, 2023 మే 06: శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 615వ జయంతి ఉత్సవాలు శనివారం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు, స్థానిక కళాకారులు కలిసి ఆలపించిన సప్తగిరి సంకీర్తనల గోష్ఠిగానం విశేషంగా ఆకట్టుకుంది.

ఇందులో ”బ్రహ్మకడిగిన పాదము…., శరణంటూ…, హరి అవతారమితడు అన్నమయ్య.., శరణు శరణు…” కీర్తనలను కళాకారులు ఆలపించారు. అనంతరం హారతి, మహానివేదన చేపట్టారు.

సాయంత్రం 6 గంటలకు తిరుప‌తికి చెందిన శ్రీ రఘునాథ్, శ్రీమతి సర్వేశ్వరి బృందం సంగీత సభ, రాత్రి 7 గంటలకు మదనపల్లికి చెందిన శ్రీమతి శారద బృందం హరికథా గానం చేయనున్నారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ అన్న‌మాచార్య ప్రాజెక్టు సంచాలకులు డాక్టర్ విభీషణ శర్మ, ఇతర అధికారులు, క‌ళాకారులు విశేష సంఖ్య‌లో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.