SRINIVASA KALYANAM IN TALLAPAKA _ తాళ్లపాకలో వైభవంగా శ్రీవారి కల్యాణం

TIRUPATI, 06 MAY 2023: As part of observing the 615th Birth Anniversary festivities of Sri Annamacharya, the saint poet and an ardent devotee of Sri Venkateswara, Srinivasa Kalyanam was observed at Tallapaka, in Annamaiah district on Saturday, the home place of the Telugu Padakavita Piatamaha.

The celestial wedding ceremony commenced by the team of Archakas at Dhyana Mandiram by 10:30am. Punyahavachanam, Pavitra Homam, Kanakana Dharana, Mangalya Dharana, Mangala Sasanam, Nakshatra Harati and finally Mangala Harati were rendered.

Devotees turned out in larger numbers to witness the divine marriage fete.

Earlier in the morning Sapthagiri Sankeertana Gosthi Ganam was arranged.

In the evening, Sangeeta Sabha by Chennai-based Sarigama Music College followed by Harikatha Parayanam by Smt Ramya Krishna and team from Tirupati are arranged by TTD.

At Rajampeta

On the occasion, Unjal seva will be performed at 108 feet. Statue of Annamacharya by Project Artistes.

ZP Chief Sri Amarnath Reddy, Municipal Chairman Sri Srinivasulu Reddy, devotees were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తాళ్లపాకలో వైభవంగా శ్రీవారి కల్యాణం

– ప్రారంభమైన అన్నమయ్య జయంతి ఉత్సవాలు

తాళ్లపాక, 2023 మే 06: శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 615వ జయంతి ఉత్సవాలు శనివారం అన్నమయ్య జిల్లా తాళ్ళపాక లో ఘనంగా ప్రారంభమయ్యాయి. తాళ్లపాకలోని ధ్యానమందిరం వద్ద ఉదయం శ్రీవారి కల్యాణం కన్నుల పండువగా జ‌రిగింది.
ఉదయం 10 గంటలకు వేద పండితులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవర్లను కల్యాణవేదిక వద్దకు తీసుకొచ్చారు. ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా స్వామివారి కల్యాణాన్ని నిర్వహించారు. పుణ్యహవచనం, పవిత్రహోమం, కంకణధారణ, మాంగళ్యధారణ, మంగళాశాసనం ఘట్టాలతో శ్రీవారి కల్యాణం జరిగింది. చివరిగా నక్షత్రహారతి, మంగళహారతి కార్యక్రమంతో కల్యాణం ముగిసింది. భక్తులకు టీటీడీ మంచినీరు, మజ్జిగ, ప్రసాదాలు అందించింది. శ్రీవారి కల్యాణం అనంతరం పెద్దసంఖ్యలో భక్తులు అన్నప్రసాదాలు స్వీకరించారు.

అంతకుముందు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు ఉదయం 9 నుండి 10 గంటల వరకు సప్తగిరి సంకీర్తనా గోష్ఠిగానం నిర్వహించారు. సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు చెన్నైకి చెందిన సరిగమ మ్యూజిక్ కాలేజి అధ్యాపకులు విద్యార్థుల సంగీత సభ, రాత్రి 8 గంటలకు తిరుపతికి చెందిన శ్రీమతి రమ్యకృష్ణ బృందం హరికథ గానం చేయనున్నారు.

రాజంపేట-కడప హైవేలో ఉన్న 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద శనివారం సాయంత్రం 6.30 నుండి 8 గంటల వరకు శ్రీవారి ఊంజల్‌సేవ వైభవంగా జరుగనుంది. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీ ప్రసాద్, శ్రీమతి రేవతి బృందం అన్నమయ్య కీర్తనలను ఆలపించనున్నారు. రాత్రి 8 గంటలకు తిరుపతికి చెందిన శ్రీమతి నాగమణి బృందం హరికథ కార్యక్రమాలు జరుగనున్నాయి.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ అమర్నాథ్ రెడ్డి, రాజంపేట మున్సిపల్ చైర్మన్ శ్రీ శ్రీనివాసులురెడ్డి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.