ANNAMACHARYA PENNED A LOT OF SANKEERTANS ON HANUMAT BHAKTI – SCHOLARS _ దాస్యభక్తికి ప్రతీక హనుమంతుడు : ఆచార్య సర్వోత్తమరావు

Tirupati, 08 May 2023: Saint Poet Sri Tallapaka Annamacharya penned a number of Sankeertans on Hanuman Bhakti said, retired Telugu Head of the Department from SV University Prof Sarvottama Rao.

 

As part of ongoing literary sessions on the occasion of 615th birth anniversary of Annamacharya at Annamacharya Kalamandiram in Tirupati on Monday, he said Hanuman stood as a role model for Bhakti and total surrender. To showcase the true bhakti, Annamaiah penned umpteen number of Sankeertans on Hanuman, he added.

 

National Sanskrit University Telugu Professor D Nallanna said Annamaiah reflected rural life style in his kritis and used proverbs and quotes in the rural slang and took devotion to grassroot level.

 

In the evening musical rendition by renowned singer Smt Bullemma and her troupe, followed by Harikatha Parayanam by Smt Sita Lakshmi will be organised.

 

Project Director Sri Vibhishana Sharma, local devotees were also present.

 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

దాస్యభక్తికి ప్రతీక హనుమంతుడు : ఆచార్య సర్వోత్తమరావు

తిరుపతి, 2023 మే 08: నవవిధ భక్తి మార్గాల్లో ఒకటైన దాస్యభక్తికి ప్రతీక హనుమంతుడనిఎస్వీయు తెలుగు విశ్రాంతాచార్యులు ఆచార్య కె.సర్వోత్తమరావు అన్నారు.

హనుమంతుని వైభవాన్ని తెలియజేస్తూ అన్నమయ్య రచించిన పలు సంకీర్తనలు ప్రాచుర్యం పొందాయన్నారు .తిరుపతిఅన్నమాచార్య కళామందిరంలో జరుగుతున్న శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 615వ జయంతి ఉత్సవాలు సోమవారం మూడో రోజుకు చేరుకున్నాయి.

ఈ సందర్భంగా నిర్వహించిన సాహితీ సదస్సుకు అధ్యక్షత వహించిన ఆచార్య సర్వోత్తమరావు “అన్నమయ్య – హనుమత్ కీర్తనలు” అనే అంశంపై ఉపన్యసించారు. శ్రీవారి అవతారమైన శ్రీరాముడు – హనుమంతుడు మధ్య దాస్య భక్తిని, శరణాగతిని తెలియజేస్తూ అన్నమయ్య పలు సంకీర్తనలు రచించారన్నారు. హనుమంతుడిని సేవకుడిగా, నమ్మిన బంటుగా, బలశాలిగా, ధైర్యశాలిగా, వ్యాకరణ వేత్తగా, పండితుడిగా అన్నమయ్య కీర్తించారని చెప్పారు. తిరుమలలోని అంజనాద్రిలోనే హనుమంతుడు జన్మించారని చెప్పేందుకు బలమైన ఆధారాలు ఉన్నాయన్నారు.

జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం తెలుగు ఆచార్యులు డా. నల్లన్న “అన్నమయ్య – గ్రామీణ జీవనం” అనే అంశంపై ఉపన్యసించారు. అన్నమయ్య తన సంకీర్తనల్లో గ్రామీణ జీవితంలోని మాధుర్యాన్ని, జానపదాలను, గ్రామాల్లోని సామెతలను, నానుడులను పొందుపరిచారని తెలియజేశారు.

జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం సహాయ ఆచార్యులు డా. గంగిశెట్టి లక్ష్మీనారాయణ “అన్నమయ్య – పౌరాణికత” అనే అంశంపై ప్రసంగించారు. అన్నమయ్య సంకీర్తనల్లో పౌరాణిక అంశాలకు పెద్దపీట వేశారని ఆయన తెలియజేశారు.

సాయంత్రం 6 గంటలకు తిరుప‌తికి చెందిన శ్రీమతి ఆర్.బుల్లెమ్మ బృందం సంగీత సభ జరుగుతుంది . రాత్రి 7 గంటలకు తిరుపతికి చెందిన శ్రీమతి సీతాలక్ష్మి బృందం హరికథా గానం చేయనున్నారు.

ఈ కార్యక్రమంలో అన్న‌మాచార్య ప్రాజెక్టు సంచాలకులు డాక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ, ఇతర అధికారులు, క‌ళాకారులు, విశేష సంఖ్య‌లో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.