LEGAL ACTION WILL BE INITIATED AGAINST ANANDA NILAYAM VIDEO MISCREANT-TTD CHIEF VIGILANCE AND SECURITY OFFICER _ ఆనంద నిలయాన్ని వీడియో చిత్రీకరించిన వ్యక్తిపై చట్టపరంగా చర్యలు : టీటీడీ సీవీఎస్వో

TIRUMALA, 08 MAY 2023: TTD will take legal action against the miscreant who captured the video of Ananda Nilayam and posted it on social media, said TTD Chief Vigilance and Security Officer Sri Narasimha Kishore.

 

In a statement, he said, as per the TTD rules and regulations, the devotees are not supposed to carry any electronic gadgets while entering Tirumala temple for Darshan of Sri Venkateswara Swamy. “The devotees are well aware about the norms, do’s and don’ts in Tirumala. They are not supposed to carry mobile phones and capture photos and videos. 

 

On May 07-05-2023, Tirumala witnessed heavy downpour coupled with thunder and lightning which resulted in the power interruption that lasted for about two hours. During that time, a devotee was suspected to have captured the video of Vimana Gopuram with a Pen Camera. 

 

“In spite of knowing all the norms, the said devotee has flouted the norms by video graphing Ananda Nilayam Vimanam and made the post viral on social media which is deplorable to note. We will trace out the miscreant and take legal action against him”, the CVSO stated. 

 

He also stated that under the instructions of TTD EO Sri AV Dharma Reddy, a detailed enquiry will be carried out in the incident.

 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
ఆనంద నిలయాన్ని వీడియో చిత్రీకరించిన వ్యక్తిపై చట్టపరంగా చర్యలు : టీటీడీ సీవీఎస్వో
 
మే 08, తిరుమల, 2023: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆనంద నిలయాన్ని వీడియో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసిన వ్యక్తిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని టీటీడీ నిఘా మరియు భద్రతాధికారి శ్రీ నరసింహ కిషోర్ తెలిపారు. 
 
టీటీడీ నిబంధనల ప్రకారం శ్రీవారి ఆలయంలోనికి ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకెళ్లడం, వీడియో చిత్రీకరించడం నేరమన్నది భక్తులందరికీ తెలుసు.
 
నిన్న రాత్రి (07-05-2023) తిరుమలలో ఉరుములతో కూడిన భారీ వర్షం  పడిన నేపథ్యంలో, దాదాపు రెండు గంటల పాటు విద్యుత్తు అంతరాయం ఏర్పడింది. ఆ సమయంలోనే  సదరు భక్తుడు పెన్ కెమెరా ద్వారా వీడియో చిత్రీకరించినట్టు అనుమానిస్తున్నామన్నారు.
 
అన్నీ తెలిసి ఒక భక్తుడు ఇలా చేయడం చాలా బాధాకరము. సీసీటీవీల ద్వారా సదరు భక్తుడిని గుర్తించి తగిన చర్యలు  తీసుకుంటామని టీటీడీ నిఘా మరియు భద్రతాధికారి శ్రీ నరసింహ కిషోర్ తెలిపారు. 
       
టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి ఆదేశాల మేరకు ఈ ఘటనపై పూర్తి విచారణ చేపడుతున్నామని కూడా సీవీఎస్వో తెలిపారు.
 
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.