ANNAMACHARYA VARDHANTI FESTIVITIES COMMENCES _ ఘనంగా శ్రీ తాళ్ల‌పాక అన్న‌మ‌య్య 520వ వర్థంతి మహోత్సవాలు ప్రారంభం

TIRUPATI, 18:MARCH 2023: In connection with the 520th Vardhanti fete of Sri Tallapaka Annamacharya, the festivities have commenced in Annamacharya Kalamandiram at Tirupati with Annamayya Gosti Ganam.

In Mahati also Harikatha Parayanam and devotional cultural programme will be presented on the occasion.

Annamacharya Project Director Dr Vibhishana Sharma is supervising the arrangements.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఘనంగా శ్రీ తాళ్ల‌పాక అన్న‌మ‌య్య 520వ వర్థంతి మహోత్సవాలు ప్రారంభం

అన్నమాచార్య కళామందిరంలో ఆక‌ట్టుకున్న సంకీర్త‌న‌ల గోష్ఠిగానం

తిరుపతి, 2023 మార్చి 18: శ్రీమాన్‌ తాళ్లపాక అన్నమాచార్యుల 520వ వర్ధంతి మహోత్సవాలు టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో అన్నమాచార్య కళామందిరంలో శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు ఆలపించిన స‌ప్త‌గిరి సంకీర్తనల గోష్ఠిగానం ఆకట్టుకుంది.

ఉదయం 9 గంటలకు అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు, స్థానిక కళాకారులు క‌లిసి దిన‌ము ద్వాదశి, సప్తగిరి సంకీర్తనలను రాగయుక్తంగా ఆలపించారు. అనంతరం హారతి, మహానివేదన చేపట్టారు.

ఉద‌యం 10 నుండి 11.30 గంట‌ల వ‌ర‌కు అన్న‌మాచార్య ప్రాజెక్టు క‌ళాకారులు శ్రీ‌మ‌తి అన్నపూర్ణ బృందం గాత్ర సంగీతం, ఉదయం 11.30 గంటలకు అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారిణి శ్రీమతి సుశీల బృందం గాత్ర సంగీత స‌భ జరిగింది.

సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీ‌మ‌తి రాధ బృందం గాత్ర సంగీత సభ నిర్వహించనున్నారు.

మహతిలో :

మహతి కళాక్షేత్రంలో శనివారం సాయంత్రం 6 నుంచి రాత్రి 7.30 గంటల వరకు ఎస్వీ సంగీత నృత్య క‌ళాశాల అధ్యాప‌కులు శ్రీ వెంకటేశ్వర్లు భాగవతార్ హరికథ పారాయణం చేయనున్నారు. రాత్రి 7.30 నుండి 8.30 గంట‌ల వ‌ర‌కు ఎస్వీ సంగీత నృత్య క‌ళాశాల అధ్యాప‌కులు శ్రీ హరనాథ్ భరతనాట్యం ప్ర‌ద‌ర్శించ‌నున్నారు.

ఈ కార్యక్రమంలో అన్న‌మాచార్య ప్రాజెక్టుసంచాల‌కులు డాక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ, అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.