ANNAMACHARYA VARDHANTI OBSERVED_ అన్నమయ్య సంకీర్తన‌ల‌తో పులకించిన నారాయణగిరి

AHOBILAM RECALLS SAINT POET’S CONNECTION WITH MUTT

TTD TO BRING OUT TUNES FOR 340 MORE SANKEERTANS

TIRUMALA, 18 MARCH 2023: The 520th Death Anniversary of Saint Poet Sri Tallapaka Annamacharya was observed with utmost devotion in Tirumala on Saturday evening.

The 46th Pontiff of Ahobilam Mutt Sri Satagopa Ranganatha Yateendra Mahadesikan Swamiji in his Anugraha Bhashanam on the occasion recalled the connection of Annamacharya with Ahobila Mutt and said the saint poet underwent his vedic education in the Mutt. He also said with the divine blessings of Sri Narasimha Swamy, Annamacharya was granted 32 Beejakshara Maha Mantram and penned 32thousand poetical gems in the form of Sankeertans.

Annamacharya Project Chief Dr Vibhishana Sharma said TTD is bringing out ”Annamaiah Sankeertana Lahari” soon in the form of a book with meanings and essence for each Kriti.

“Last year we tuned 300 new songs and this year another 340 are under way”, he maintained.

Earlier, the Annamacharya Project artistes and vocalists of SV College of Music and Dance rendered Sapthagiri Sankeertans penned by the saint poet in a befitting manner in front of Sri Malayappa Swamy flanked by Sridevi and Bhudevi on a finely decked unjal in Narayanagiri Gardens.

Later TTD EO Sri AV Dharma Reddy presented the Srivari prasadams to the Pontiff.

Temple Peishkar Sri Srihari, TTD Asthana Vidhwan Dr Balakrishna Prasad, Principal of SVCMD Dr Uma Muddubala, veteran and versatile Annamacharya Project artistes, Bhajana team members from different states were also present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

అన్నమయ్య సంకీర్తన‌ల‌తో పులకించిన నారాయణగిరి

– తిరుమలలో ఘనంగా అన్నమయ్య వర్ధంతి

తిరుమల, 18 మార్చి 2023: పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 520వ వర్ధంతిని పురస్కరించుకుని తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో శనివారం సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి ఊంజల్‌సేవలో నిర్వహించిన సప్తగిరి సంకీర్తనల గోష్టిగానంతో ఏడుకొండలు పులకించాయి.

ఈ కార్యక్రమానికి విచ్చేసిన అహోబిల మఠం 46వ పీఠాధిపతి శ్రీమాన్‌ శ్రీవణ్‌ శఠగోప రంగనాథ యతీంద్ర మహాదేశికన్‌ స్వామిజీ అనుగ్రహభాషణం చేశారు. అన్నమయ్యకు, వారి ఆచార్యపీఠమైన అహోబిల మఠానికి ఎంతో అనుబంధం ఉందని తెలిపారు. అన్నమయ్య విద్యాభ్యాసం, వేదశాస్త్రాల అధ్యయనం ఇక్కడే సాగిందని చెప్పారు. అహోబిలం శ్రీ నరసింహస్వామివారి అనుగ్రహంతో శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు దీక్ష పొంది మంత్రోపదేశం పొందారని వివరించారు. ఈ మంత్రోపదేశంలోని 32 బీజాక్షరాలతో అన్నమయ్య 32 వేల సంకీర్తనలు రచించారన్నారు. 32 వేల సంకీర్తనలకు గుర్తుగా 32 మంది సంగీత విద్వాంసులతో అన్నమయ్య సంకీర్తనలు వినాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా స్వామీజీని ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి శాలువతో సత్కరించి శ్రీవారి ప్రసాదం అందజేశారు. అనంతరం అహోబిల మఠం తరఫున శ్రీ తాళ్లపాక అన్నమయ్య విగ్రహానికి వస్త్రం సమర్పించారు.

అన్న‌మాచార్య ప్రాజెక్టు సంచాల‌కులు డా. ఆకెళ్ల విభీషణ శ‌ర్మ మాట్లాడుతూ సంకీర్తనలతో శ్రీవారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసిన పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 520వ వర్ధంతి మహోత్సవాలను తిరుమలలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా తిరుప‌తి, తాళ్ళ‌పాకలో కూడా ఈ ఉత్స‌వాలు నిర్వ‌హిస్తున్న‌ట్లు వివ‌రించారు. అన్నమయ్య సాహిత్యాన్ని భక్తలోకానికి అందించేందుకు సంకీర్తనల అర్థాలతో “అన్నమయ్య సంకీర్తనలహరి” అనే పుస్తకం సిద్ధమవుతోందని తెలిపారు. ఇప్పటివరకు సుమారు 4 వేల సంకీర్తనల రికార్డింగ్ జరిగిందని, గతేడాది 300 సంకీర్తనలను రికార్డు చేయగా, ఈ సంవత్సరంలో 340 సంకీర్తనలు రికార్డు చేయాలని టిటిడి సంకల్పించిందని తెలియజేశారు.

ముందుగా నిర్వహించిన దినము ద్వాదశి, సప్తగిరి సంకీర్తనల గోష్టిగానంలో భాగంగా ”దినము ద్వాదశి నేడు…, భావములోన బాహ్యము నందును…., బ్రహ్మ కడిగిన పాదము…, ఎంత మాత్రమున ఎవ్వరు దలిచిన…., పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా…., కొండలలో నెలకొన్న కోనేటిరాయడు వాడు…., నారాయణతే నమో నమో…., ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు…., వేదములే నీ నివాసమట…” కీర్తనలను కళాకారులు రసరమ్యంగా గానం చేశారు. వీరిలో టిటిడి ఆస్థాన విద్వాంసులు శ్రీ గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్‌, ఎస్వీ సంగీత కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి ఉమా ముద్దుబాల, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీ జి.మధుసూదనరావు, శ్రీ బి.ర‌ఘునాథ్‌, శ్రీ‌మ‌తి బుల్లెమ్మ‌తో పాటు ప్రముఖ సంగీత విద్వాంసులు శ్రీ పారుపల్లి రంగ‌నాథ్‌, శ్రీ ఆనంద భట్టర్, డా.కె. వందన, వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన భజన బృందాల సభ్యులు ఉన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆలయ పేష్కార్ శ్రీ శ్రీహరి ఇతర అధికారులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.