ANNAMAIAH CDs RELEASED_ అన్నమయ్య సంకీర్తనల సిడిలు ఆవిష్కరణ

Tirupati, 18 July 2019: Twin CDs ANNAMAYYA APURVA SRINGARAM Composed by Sri.K.Raja sung by Sri. Lokesh and Smt. Anjana Swomya and ANNAMAYYA APURVA SHOBA Composed by Sri. K.Raja and sung by Smt. Srinidhi and Sri. Sarath Santosh were released by Director Annamacharya Project Acharya B Vishwanatham at Annamacharya Kalamandiram in Tirupati.

These CDs were released in connection with Sravana Nakshatram Day on Thursday.

Later the artistes presented a few sankeertans and enthralled the music lovers who attended the event.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

అన్నమయ్య సంకీర్తనల సిడిలు ఆవిష్కరణ

తిరుపతి, 2019 జూలై 18: శ్రీవారు జన్మించిన శ్రవణానక్షత్రాన్ని పురస్కరించుకుని గురువారం సాయంత్రం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో “అన్న‌మ‌య్య అపూర్వ శృంగారం”, “అన్న‌మ‌య్య అపూర్వ శోభ” సిడిలను అన్న‌మాచార్య ప్రాజెక్టు డైరెక్ట‌ర్ ఆచార్య బి.విశ్వనాథ్‌, ఎస్వీ రికార్డింగ్‌ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ మునిరత్నంరెడ్డి ఆవిష్కరించారు.

ఈ సంద‌ర్భంగా శ్రీ మునిరత్నంరెడ్డి మాట్లాడుతూ ఎస్వీ రికార్డింగ్‌ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఇప్ప‌టివ‌ర‌కు 3,661 సంకీర్త‌న‌ల రికార్డింగ్ పూర్త‌యిన‌ట్టు తెలిపారు. ఈ సంకీర్తనలను టిటిడి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామ‌ని, భక్తులు ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం కల్పించామ‌ని వివ‌రించారు.

కాగా, ఈ సిడిల్లోని సంకీర్త‌న‌ల‌ను ప్ర‌ముఖ సంగీత విద్వాంసులు శ్రీ కె.రాజ స్వ‌ర‌ప‌రిచారు. అన్న‌మ‌య్య అపూర్వ శృంగారం సిడిలోని సంకీర్త‌న‌ల‌ను శ్రీ లోకేష్‌, శ్రీ‌మ‌తి అంజ‌నా సౌమ్య ఆల‌పించారు. అదేవిధంగా, అన్న‌మ‌య్య అపూర్వ శోభ సిడిలోని సంకీర్త‌న‌ల‌ను శ్రీ‌మ‌తి శ్రీ‌నిధి, శ్రీ శర‌త్ సంతోష్ గానం చేశారు. ఈ సందర్భంగా గాయ‌కుల‌ను శాలువతో సన్మానించి శ్రీవారి తీర్థప్రసాదాలను అందించారు. అనంతరం గాయ‌నీ గాయ‌కులు ఈ సంకీర్తనలను అద్భుతంగా పాడి వినిపించారు. ఈ కార్యక్రమంలో టిటిడి అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.