AMBULANCE DONATED_ శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అంబులెన్స్ విరాళం
Tiruchanoor, 18 July 2019: A Mumbai based philanthropist Sri Ajay Sahoo, has donated Rs. 25lakhs worth ambulance van to TTD on Thursday.
Tirupati JEO Sri P Basant Kumar who received the donation on behalf of TTD at Tiruchanoor said that earlier also the donor has contributed largesse to SV Gosamrakshana Trust. This van will be made available at Sri Padmavathi Ammavaru temple premises to meet the medical emergency of pilgrims if any, hr added.
GM Transport Sri Sesha Reddy, Director Go Samrakshanashala Sri Dr Harnath Reddy, Temple DyEO Smt Jhansi Rani was also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అంబులెన్స్ విరాళం
జూలై 18, తిరుపతి, 2019: ముంబయికి చెందిన శ్రీ అజయ్ కుమార్ సాహు అనే భక్తుడు తన తల్లి కీ.శే. డా. ఇందిర సాహు జ్ఞాపకార్థం రూ.25 లక్షలు విలువైన అంబులెన్స్‌ను శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి విరాళంగా అందించినట్టు టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పి.బసంత్ కుమార్ తెలిపారు. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద గురువారం అంబులెన్సుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దాత వాహనం తాళాలను జెఈవోకు అందజేశారు.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ అంబులెన్స్ వాహనం కోసం రూ.20 లక్షలు, అందులోని అధునాతన వైద్య పరికరాల కోసం రూ.5 లక్షలు దాత ఖర్చు చేసినట్టు తెలిపారు. అమ్మవారి దర్శనార్థం వచ్చే భక్తులకు అత్యవసర వైద్యసేవలు అందించేందుకుగాను అత్యాధునిక అంబులెన్స్‌ను వినియోగిస్తామన్నారు. గతంలోనూ గోసంరక్షణ కోసం దాత విరాళం అందించినట్టు తెలిపారు. దాతకు అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ట్రాన్స్‌పోర్టు జిఎం శ్రీ శేషారెడ్డి, ఎస్వీ గోశాల సంచాలకులు డా. హరనాథరెడ్డి, ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీమతి ఝాన్సీరాణి, ఎవిఎస్వో శ్రీ నందీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.