ANNAMAIAH SANKEERTANS SHOULD REACH YOUTH -ADDITIONAL EO _ అన్నమయ్య కీర్తనలు యువతకు చేరువకావాలి : అద‌నపు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి

అన్నమయ్య కీర్తనలు యువతకు చేరువకావాలి : అద‌నపు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి

తిరుమ‌ల‌, 2021 జూలై 05: తిరుమ‌ల శ్రీవేంకటేశ్వరస్వామివారి తత్త్వాన్ని లోకానికి చాటిన అన్నమయ్య కీర్తనలలోని ఆధ్యాత్మికతత్త్వం, గొప్పతనం యువతకు చేరువ కావాలని టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి వెల్లడించారు. తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌నంలో సోమ‌వారం అద‌న‌పు ఈవో అన్న‌మ‌య్య సంకీర్త‌న‌ల రికార్డింగ్ సెల‌క్ష‌న్‌ క‌మిటీ స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సందర్భంగా అద‌న‌పు ఈవో మాట్లాడుతూ శ్రీ తాళ్లపాక అన్నమయ్య కొన్ని వందల సంవత్సరాల క్రితమే శ్రీవేంకటేశ్వరస్వామివారి వైశిష్ఠ్యాన్ని ఆధారం చేసుకుని అనేక విషయాలను అనేక కోణాల్లో సామాన్య ప్రజలకు అందించారని తెలిపారు. అన్నమయ్య 32 వేల కీర్తనలను రచించగా 14 వేల కీర్తనలను స్వరపరిచేందుకు గుర్తించామని చెప్పారు. అన్న‌మ‌య్య సంకీర్త‌న‌ల రికార్డింగ్ సెల‌క్ష‌న్ క‌మిటీ యువ‌త‌కు ప్రాదాన్యం ఇవ్వాల‌ని, ఎంపికైన క‌ళాకారుల‌తో వెయ్యి కీర్తనలను ఎస్వీ రికార్డింగ్‌ ప్రాజెక్టు ద్వారా రికార్డింగ్ చేస్తామ‌ని చెప్పారు.

అన్న‌మ‌య్య హృద‌యాన్ని ఆవిష్క‌రించేలా సంకీర్త‌న‌లు అల‌పించే క‌ళాకారులను ఎంపిక చేయాల‌ని సూచించారు. క‌ళాకారుల‌కు ప్ర‌తి కీర్త‌న యొక్క అర్థ‌ తాత్ప‌ర్యాలు వివ‌రించి, సంగీతం – సాహిత్యాల‌ను అను సంధానం చేస్తూ, ఆధ్యాత్మికంగా ప‌రిప‌క్వ‌త‌తో అల‌పించేలా చూడాల‌న్నారు. ఎస్వీబీసిలో ప్ర‌తి రోజు 30 నిమిషాలు అన్న‌మాచార్య, పురంద‌ర‌దాపులు, త‌రిగొండ వెంగ‌మాంబ‌ సంకీర్తన కార్య‌క్ర‌మాన్ని ప్ర‌సారం చేయ‌నున్న‌ట్లు వివ‌రించారు.

ఈ స‌మావేశంలో ఎస్వీబీసీ ఛైర్మ‌న్ శ్రీ సాయి కృష్ణ యాచేంద్ర, ఎస్వీ ఉన్న‌త వేద అధ్య‌య‌న‌ సంస్థ ప్రాజెక్టు అధికారి డాక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ, దాస సాహిత్య ప్రాజెక్టు ప్ర‌త్యేకాధికారి శ్రీ ఆనంద తీర్థచార్యులు, టిటిడి ఆస్థాన విద్వాంసులు శ్రీ గ‌రిమెళ్ల బాల‌కృష్ణ ప్ర‌సాద్‌, ప్ర‌ముఖ క‌ళాకారులు శ్రీ‌మ‌తి క‌న్యాకుమారి, శ్రీ మోహ‌న కృష్ణ‌, ఆచార్య రాణి స‌దాశివ‌మూర్తి, ఇత‌ర క‌ళాకారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది

TIRUPATI, 05 JULY 2021: The great essence of Bhakti embedded in the sankeertans penned by Telugu Pada Kavita Pitamaha, Sri Tallapaka Annamacharya should reach the youth, said TTD Additional EO Sri AV Dharma Reddy.

Reviewing on the Annamaiah Sankeertans Recording with the Selection Committee at Annamaiah Bhavan in Tirumala on Monday, the Additional EO said, the saint-poet has penned 32,000 Sankeertans of which 14,000are available and TTD is doing the composition for all these Sankeertans to bring before the devotees.

He is also of the opinion that the Committee should give priority to youth. The committee should record 1000 Sankeertans while recording them through SV Recording Project.

TTD is also planning half an hour program every day telecasting Annamacharya, Tarigonda Vengamamba, Sri Purandara Dasa Sankeertans in SVBC. So the Selection Committee should select the youth who are well versed and sing the Sankeertans with utmost devotion, he opined.

SVBC Chairman Sri Saikrishna Yachendra, Dasa Sahitya Project Special Officer Dr PR Ananda Theerthacharyulu, SVHVS Project Officer Dr A Vibhishana Sharma, Astana Vidwan Dr G Balakrishna Prasad, renowned violin artist Kumari Kanyakumari, vocalist Sri Mohanakrishna, Professor Sri Rani Sada Sivamurti were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI