ANNAMAIAH SAPATHAGIRI SANKEERTHANA GOSTI GANAM ON MARCH 21 AT TIRUMALA _ మార్చి 21న తిరుమలలో అన్నమయ్య సప్తగిరి సంకీర్తనా గోష్టిగానం

Tirumala, 17 Mar. 20: TTD is organising a Saptagiri Sankeertana Gosti Ganam as a part of 517th Vardhanti of Sri Tallapaka Annamacharya at the Narayanagiri gardens in Tirumala on March 21.

Earlier utsava idols of Sri Malayappa Swamy and his consorts will be brought to the gardens in a procession from Srivari temple.

The 46th pontiff of Sri Ahobilam Mutt Sri Sri Sri Sri Ranganatha Yatindra Maha Desikan Swami will render Anugraha Bhashanam.

TTD Asthana Sangeeta Vidhwan Dr Garimella Balakrishna Prasad and artists of Annamacharya project will participate in the event.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

మార్చి 21న తిరుమలలో అన్నమయ్య సప్తగిరి సంకీర్తనా గోష్టిగానం

తిరుమల, 2020 మార్చి 17: పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 517వ వర్ధంతిని పురస్కరించుకుని మార్చి 21వ తేదీ శ‌నివారం తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో సప్తగిరి సంకీర్తనా గోష్టిగానం ఘనంగా జరుగనుంది. శ్రీవారి ఆలయం నుండి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఊరేగింపుగా బయల్దేరి సాయంత్రం 6.00 గంటలకు నారాయణగిరి ఉద్యానవనాలకు చేరుకుంటారు.

శ్రీ అన్నమాచార్య గురుపరంపరకు చెందిన శ్రీ అహోబిల మఠం 46వ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శఠగోప శ్రీరంగనాథ యతీంద్ర మహాదేశికన్‌ స్వామీజి అనుగ్రహభాషణం చేస్తారు. టిటిడి ఆస్థాన విద్వాంసులు శ్రీ గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్‌, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భజన బృందాల సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.