25th FETE OF MANAGUDI BY TTD _ తెలుగు రాష్ట్రాల్లో మ‌న‌గుడి – మార్చి 25న ఉగాది, ఏప్రిల్ 2న‌ శ్రీరామనవమి

Tirupati, 17 Mar. 20: TTD is all set to observe, its 25th phase of mass religious programme Managudi under the aegis of Hindu Dharma Prachara Parishad on March 25 and April 2 in Telugu states.

As a part of Managudi, TTD is organising Ugadi festival on March 25 and Sri Ramanavami on April 2 at all Ramalayams of both Telugu states.

Panchangam shravanam and Ugadi pacchadi will be distributed at all temples on Sri Sarvari Nama Telugu Ugadi on March 25. Special religious discourses for seven days have been arranged at all Sri Rama temples as a part of Sri Ramanavami celebrations.

GRAND UGADI FETE AT MAHATI

Meanwhile, Sri Sarvari Nama Ugadi Utsavam will be observed in a big way at Mahati Auditorium in Tirupati on March 25.

Acharya Rajagopalan, secretary of HDPP is supervising all the arrangements. 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తెలుగు రాష్ట్రాల్లో మ‌న‌గుడి – మార్చి 25న ఉగాది, ఏప్రిల్ 2న‌ శ్రీరామనవమి

తిరుప‌తి, 17 మార్చి 2020: టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో మనగుడి-25 కార్యక్రమంలో భాగంగా మార్చి 25న ఉగాది, ఏప్రిల్ 2న శ్రీరామనవమి వేడుకలను తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లా కేంద్రాల్లో గ‌ల‌ రామాల‌యాల్లో నిర్వహించనున్నారు.

ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణం వినిపించడంతోపాటు ఉగాది పచ్చడి పంపిణీ చేస్తారు. ఏప్రిల్ 2న శ్రీరామనవమి సందర్భంగా రామాలయాల్లో ఏడు రోజుల పాటు ప్రముఖ పండితులు ” శ్రీరామనవమి విశిష్టత, శ్రీరాముడు ధర్మస్వరూపుడు, సీతా చరిత్ర, సేవాధర్మం, రామాయణం ఇంటింటి కథ, శ్రీరామరాజ్యం, రామాయణం జాతికి సందేశం” అనే అంశాలపై ధార్మికోపన్యాసాలు చేస్తారు. టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ కార్యదర్శి ఆచార్య‌ రాజ‌గోపాల‌న్ ఈ కార్యక్రమాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.