ANNAMAIAH SAPTHAGIRI SANKIRTAN GOSTI GANAM ON APRIL 08 _ ఏప్రిల్ 8న తిరుమలలో అన్నమయ్య సప్తగిరి సంకీర్తనా గోష్టిగానం
Tirumala 05 April 2021: As part of the 518th Vardhanti of saint-poet Sri Tallapaka Annamacharya, TTD is organising Sapthagiri Sankeetana Gosti Ganam on April 8 at the Narayanagiri Gardens in adherence to Covid guidelines.
Earlier the utsava idols of Sri Malayappa Swamy and His consorts Sri Devi and Sri Bhudevi will arrive in a procession to the Narayanagiri Gardens in the evening.
The event will be graced by the 46th pontiff of the Ahobila mutt Sriman Srivan Shatagopa Sri Ranganatha Yatindra Mahadesikan Swami.
The artists of the Annamacharya Project, students, teachers of the SV Music and Dance College, artists and bhajan teams from many regions will present the Gana Gosti on Thursday evening between 6pm and 8:30pm.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
ఏప్రిల్ 8న తిరుమలలో అన్నమయ్య సప్తగిరి సంకీర్తనా గోష్టిగానం
తిరుమల, 2021 ఏప్రిల్ 05: పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 518వ వర్ధంతిని పురస్కరించుకుని ఏప్రిల్ 8వ తేదీ తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో సప్తగిరి సంకీర్తనా గోష్టిగానం ఘనంగా జరుగనుంది. శ్రీవారి ఆలయం నుండి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఊరేగింపుగా బయల్దేరి సాయంత్రం 6.00 గంటలకు నారాయణగిరి ఉద్యానవనాలకు చేరుకుంటారు. కోవిడ్ – 19 నిబంధనలు పాటిస్తూ ఈ ఉత్సవాలు నిర్వహించనున్నారు.
శ్రీ అన్నమాచార్య గురుపరంపరకు చెందిన శ్రీ అహోబిల మఠం 46వ పీఠాధిపతి శ్రీమాన్ శ్రీవణ్ శఠగోప శ్రీరంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామీజీ విచ్చేస్తారు. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల అధ్యాపకులు, విద్యార్థులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రముఖ కళాకారులు, భజన బృందాల సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.