ANNAPRASADAM ACTIVITIES REVIEWED _ అన్నప్రసాదంలో నాణ్యతను మరింత మెరుగుపరచండి- టీటీడీ ఈవో

1.75LAKH SERVINGS A DAY IN TIRUMALA

1.92LAKH SERVINGS A DAY IN TIRUPATI 

RS.1892Cr IN CORPUS

TIRUMALA, 19 JUNE 2024: TTD EO Sri J Syamala Rao on Wednesday reviewed the activities of Annaprasadam Wing of TTD and made valuable suggestions to the officers concerned to improve the taste and quality of Annaprasadam.

As a part of cognizing the work nature of each department in TTD, the EO reviewed in length about the Annaprasadam wing in the Conference Hall of Gokulam Rest House in Tirumala along with the JEOs Smt Goutami, Sri Veerabrahmam.

He reviewed the places of work where food is prepared in Tirumala including Matrusri Tarigonda Vengamamba Annaprasadam Complex(MTVAC), Akshaya Kitchen in VQC, PAC 2 for the sake of pilgrims besides Employees’ Canteen and SPRH. He directed the officials of Annaprasadam and Engineering department to consider the opening of Panchajanyam Kitchen which was kept on hold, by completing the pending works soon. He also verified that on an average per day the Annaprasadam is being served to nearly 1.95lakh pilgrims during weekends and 1.75lakh in the normal days in all these centres in Tirumala while 2.13lakh during weekends and 1.92lakh during normal days in Tirupati. The PowerPoint Presentation on Annaprasadam also highlighted that the corpus in Annaprasadam Trust is at Rs.1892crore and the average expenditure on any given day is at Rs.38lakh. The EO also reviewed on Vegetable Donors, One Day Donation Scheme and others.

Later the EO also suggested to the Deputy EO Sri Rajendra, Catering Special Officer Sri GLN Shastry to enhance the quality of butter milk being served to the devotees, and to keep the premises inside the cooking area clean and dry. 

On the issues front which included enhancing the manpower in accordance with the increasing pilgrims at Tirumala and Tirupati, replacing the decade old machinery with new ones to meet the increasing demand, appointing a Food Consultant to enhance the quality as well the quantity of Annaprasadam, the EO directed the officers concerned to come out with a concrete action plan to execute the above requirements as soon as possible. 

ISSUED BY THE CHIEF PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

అన్నప్రసాదంలో నాణ్యతను మరింత మెరుగుపరచండి- టీటీడీ ఈవో

తిరుపతి, 2024 జూన్ 19: తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు మరింత నాణ్యమైన, రుచికరమైన అన్నప్రసాదాలు అందించాలని టీటీడీ ఈవో శ్రీ జె శ్యామల రావు అధికారులను ఆదేశించారు. టీటీడీ అన్నప్రసాద విభాగం కార్యకలాపాలను బుధవారం ఈవో సమీక్షించారు.

టీటీడీలోని ప్రతి విభాగం పని తీరుపై తెలుసుకోవడంలో భాగంగా తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనంలోని సమావేశ మందిరంలో జేఈవోలు శ్రీమతి గౌతమి, శ్రీ వీరబ్రహ్మంలతో కలిసి అన్నప్రసాద విభాగాన్ని సంబంధిత అధికారులతో కలసి ఈవో సుదీర్ఘంగా సమీక్షించారు.

తిరుమలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్‌(ఎంటీవీఏసీ), విక్యూసీలోని అక్షయ కిచెన్‌, పీఏసీ 2తో పాటు, ఉద్యోగుల క్యాంటీన్‌, పద్మావతి అతిథి గృహం సహా తిరుమలలో అన్నప్రసాదాలు తయారు చేసే ప్రదేశాలను ఆయన సమీక్షించారు. పెండింగ్‌లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేసి, తాత్కాలికంగా నిలిపివేసిన పాంచజన్యం వంటశాలను త్వరగా ప్రారంభించేలా చూడాలని అన్నప్రసాదం, ఇంజినీరింగ్ శాఖ అధికారులను ఆదేశించారు.

కాగా తిరుమల మరియు తిరుపతి లతో కలిపి రోజుకు సగటున తిరుమలలో 1.92 లక్షల మంది అన్నప్రసాదం స్వీకరిస్తుండగా వీరిలో తిరుమల లో దాదాపు 1.75లక్షలు, తిరుపతిలో 17 వేలు, వారాంతాల్లో తిరుమలలో రమారమి 1.95 లక్షలు, తిరుపతిలో 19 వేలతో కలిపి సుమారు 2.14 లక్షల మందికి అన్నప్రసాదం స్వీకరిస్తున్నారు.

కాగా ఒక రోజున అన్నప్రసాదం కోసం అవుతున్న ఖర్చు దాదాపు రూ.38 లక్షలుగా ఉంది. ఈ సందర్భంగా కూరగాయల దాతలు, ఒకరోజు విరాళం పథకం తదితర అంశాలపై కూడా ఈఓ సమీక్షించారు.

అనంతరం భక్తులకు అందజేస్తున్న మజ్జిగలో నాణ్యత పెంచాలని, వంట చేసే స్థలంలో ఆవరణను పరిశుభ్రంగా, పొడిగా ఉంచాలని అధికారులకు ఈఓ సూచించారు. ఆహార పదార్థాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని ఫుడ్ క్వాలిటీ ఇన్‌స్పెక్టర్‌ను ఆదేశించారు.

తిరుమల, తిరుపతిలలో పెరుగుతున్న భక్తుల సంఖ్యకు అనుగుణంగా సిబ్బందిని పెంచడం, పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా దశాబ్దాల నాటి యంత్రాల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేయడం, అన్నప్రసాదం నాణ్యతను పెంచేందుకు ఫుడ్‌ కన్సల్టెంట్‌ను నియమించడం వంటి అంశాలకు సంబంధించి వీలైనంత త్వరగా అమలు చేసేందుకు పక్కా కార్యాచరణ ప్రణాళికతో ముందుకు రావాలని సంబంధిత అధికారులను ఈఓ ఆదేశించారు.

డిప్యూటీ ఈఓ శ్రీ రాజేంద్ర, క్యాటరింగ్ స్పెషల్ ఆఫీసర్ శ్రీ జిఎల్ఎన్ శాస్త్రి, ఫుడ్ ఇన్‌స్పెక్టర్ శ్రీ శ్రీనివాసన్ తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.