ANNUAL BRAHMOTAVAMS IN NANDALURU TEMPLE _ జూలై 05 నుండి 13వ తేదీ వరకు నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

TIRUPATI, 24 JUNE 2025: The annual brahmotsavams will be observed in Sri Soumyanatha Swamy temple at Nandaluru in Annamaiah District from July 05 to 13.

Commencing with Dhwajarohanam on July 05, the important days includes Garuda Vahanam on July 09, Arjita Kalyanotsavam on July 11 at 10am, Rathotsavam on July 12 at 8am and Chakra Snanam on July 13 while on July 14 Pushpa Yagam will be observed.

The Grihastas willing to take part in Kalyanotsavam have to pay Rs.500 per ticket on which two persons will be allowed.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జూలై 05 నుండి 13వ తేదీ వరకు నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుపతి, 2025, జూన్ 24: అన్నమయ్య జిల్లా నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు జూలై 05 నుండి 13వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాలకు జూలై 04వ తేదీ అంకురార్పణ నిర్వహిస్తారు.

జూలై 05న ఉదయం 10.30 నుండి 11.00 గంటల వరకు ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు ఉదయం 8 గంటలకు, రాత్రి 7 గంటలకు వాహనసేవలు జరుగుతాయి.

వాహనసేవల వివరాలు :

తేదీ

05-07-2024

ఉదయం – ధ్వజారోహణం

రాత్రి – యాలి వాహనం

06-07-2024

ఉదయం – పల్లకీ సేవ

రాత్రి – హంస వాహనం

07-07-2024

ఉదయం – పల్లకీ సేవ

రాత్రి – సింహ వాహనం

08-07-2024

ఉదయం – పల్లకీ సేవ

రాత్రి – హనుమంత వాహనం

09-07-2024

ఉదయం – శేష వాహనం

రాత్రి – గరుడ వాహనం

10-07-2024

ఉదయం – సూర్యప్రభ వాహనం

రాత్రి – చంద్రప్రభ వాహనం

11-07-2024

ఉదయం – ఆర్జిత కల్యాణోత్సవం (ఉదయం 10 గంటలకు)

రాత్రి – గజ వాహనం

12-07-2024

ఉదయం – రథోత్సవం (ఉదయం 08 గంటలకు)

రాత్రి – అశ్వవాహనం

13-07-2024

ఉదయం – చక్రస్నానం

రాత్రి – ధ్వజావరోహణం

జూలై 11వ తేదీ ఉదయం 10 గంటలకు ఆర్జిత కల్యాణోత్సవం జరుగనుంది. గృహస్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదాలు బహుమానంగా అందజేస్తారు. జూలై 14న సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్ట్, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.