ANNUAL VASANTHOTSAVAMS AT TIRUCHANOOR _ మే 4 నుండి 6వ తేదీ వరకు శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు

TIRUPATI, 18 APRIL 2023: The annual Vasanthotsavams in Tiruchanoor Sri Padmavathi temple will be observed between May 4 and 6.

Everyday this religious spring festival takes place between 2.30pm and 4:30pm in the Friday Gardens.

On May 2, Koil Alwar Tirumanjanam will be performed. TTD has cancelled Kalyanotsavam and Sahasra Deepalankara Seva in connection with this three-day annual fete from May 2-6.

On May 3, TTD has cancelled Astottara Sata Kalasabhishekam and on May 5, Lakshmi Puja.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

 

మే 4 నుండి 6వ తేదీ వరకు శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు

– మే 2న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

తిరుపతి, 2023 ఏప్రిల్ 18: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మే 4 వ తేదీ నుండి 6వ తేదీ వరకు వార్షిక వసంతోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం మే 3వ తేదీ సాయంత్రం 6 గంట‌ల‌కు అంకురార్పణ నిర్వ‌హిస్తారు. భక్తులు ఒక్కొక్కరు రూ.150/- చెల్లించి వసంతోత్సవంలో పాల్గొనవచ్చు.

ఉత్సవాల్లో భాగంగా మే 5వ తేదీ ఉదయం 9.10 గంటలకు స్వర్ణ రథోత్సవం కన్నులపండువగా జరుగనుంది. వసంతోత్సవాలు జరిగే మూడు రోజులు మధ్యాహ్నం 2.30 గంటల నుండి సాయంత్రం 4.30 గంటల వరకు శుక్రవారపు తోటలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో అమ్మ‌వారు విహరించి భ‌క్తుల‌ను కటాక్షించనున్నారు.

మే 2న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

శ్రీ పద్మావతీ అమ్మవారి వార్షిక వసంత్సోవాలను పురస్కరించుకుని మే 2వ తేదీ ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి ఉదయం 6 నుండి 9 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేయనున్నారు. నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. ఉదయం 9 గంటల నుండి భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు.

ఈ ఉత్స‌వాల కార‌ణంగా మే 2 నుండి 6వ తేదీ వ‌రకు క‌ల్యాణోత్స‌వం, సహ‌స్ర‌దీపాలంకార‌సేవ‌, మే 3న అష్టోత్తర శతకలశాభిషేకం, మే 5న లక్ష్మి పూజ ఆర్జిత‌సేవ‌ల‌ను టీటీడీ ర‌ద్దు చేసింది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.