ON-LINE QUOTA OF SRIVARI SEVA TICKETS _ ఏప్రిల్ 20న శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల

TIRUMALA, 17 APRIL 2023: The on-line quota of Srivari Arjitha Seva tickets including electronic dip, Anga Pradakshinam, virtual sevas will be released on different dates for different months.

 

The details as follows:

 

The online quota of Arjita Seva tickets for the month of July in Electronic DIP will be available with effect from April 20 at 10am onwards. Registrations will be open till 10am of April 22. The dip allotment process commences from 12 noon onwards.

 

The on-line quota of Srivari Arjitha Seva tickets including Kalyanam, unjal seva, arjitha brahmotsavam and sahasra deepalankara seva for the month of July will be available for booking on April 20 from 11.30am onwards while the SRIVANI Trust tickets at 3pm on the same day.

 

The Anga Pradakshinam tokens for the month of July will be available for booking on April 21 by 10am onwards while the Physically challenged will be released on the same day at 3pm. 

 

The online seva [virtual participation] and connected darshan slots quota for Kalyanotsavam, Unjal Seva, Arjitha Brahmotsavam, Sahasra Deepalankara Sevas of Srivari Temple, for the months of May and June 2023 will be released on April 24 at 10am and 3pm respectively.

 

The online quota of SED tickets for the month of May will be released on April 25 at 10am. The online quota of accommodation at Tirumala will be released at 10am on April 26 and accommodation in Tirupati at 10am of April 27.

 

The devotees are requested to make note of this and book their darshan and accommodation online. 

 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఏప్రిల్ 20న శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల

 తిరుమల, 18 ఏప్రిల్ 2023:  తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన జూలై నెల కోటాను ఏప్రిల్ 20న ఉదయం 10 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఏప్రిల్ 22వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. అదేరోజు మధ్యాహ్నం 12 గంటలకు లక్కీడిప్ లో టికెట్లు మంజూరవుతాయి. ఈ టికెట్లు పొందిన వారు సొమ్ము చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. 

అదేవిధంగా, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవాటికెట్ల కోటాను ఏప్రిల్ 20వ తేదీ ఉదయం 11.30 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటా….

శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన జూలై నెల ఆన్ లైన్ కోటాను ఏప్రిల్ 20వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టిటిడి విడుదల చేయనుంది.

ఏప్రిల్ 21న అంగప్రదక్షిణం టోకెన్లు….

జూలై నెల‌కు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను ఏప్రిల్ 21న ఉదయం 10 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా…

వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా మే నెల ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను ఏప్రిల్ 21న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.

ఏప్రిల్ 24న వర్చువల్ సేవల కోటా విడుదల

వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన మే నెల కోటాను ఏప్రిల్ 24న ఉదయం 10 గంటలకు, జూన్ నెల కోటాను ఏప్రిల్ 24న మధ్యాహ్నం 3 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

ఏప్రిల్ 25న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల

మే, జూన్ నెల‌కు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఏప్రిల్ 25న ఉదయం 10 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

తిరుమలలో మే నెల గదుల కోటాను ఏప్రిల్ 26న ఉదయం 10 గంటలకు, తిరుపతిలో మే నెల గదుల కోటాను ఏప్రిల్ 27న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

భక్తులు ఈ విషయాలను గమనించి టికెట్లు బుక్ చేసుకోవాలని కోరడమైనది.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.