అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్నవేంకటేశ్వరాలయంలో పుష్పయాగానికి ఘనంగా అంకురార్పణ

అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్నవేంకటేశ్వరాలయంలో పుష్పయాగానికి ఘనంగా అంకురార్పణ

తిరుపతి, 2019 జూలై 17: టిటిడికి అనుబంధంగా ఉన్న అప్పలాయగుంటలోని శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో గురువారం నిర్వహించనున్న పుష్పయాగానికి బుధ‌వారం సాయంత్రం ఘనంగా అంకురార్పణ జరుగనుంది.

ఈ సందర్భంగా ఉదయం 9 నుంచి 10 గంటల వరకు ఆచార్య ఋత్విక్‌వరణం నిర్వహించారు. సాయంత్రం 7 నుంచి 8.30 గంటల వరకు మేదినిపూజ‌, సేనాధిప‌తి ఉత్స‌వం, అంకురార్పణ ఘట్టాల‌ను శాస్త్రోక్తంగా చేప‌ట్టారు.

ఈ ఆలయంలో జూన్‌ 13 నుండి 21వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగాయి. బ్రహ్మోత్సవాల్లో ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. జూలై 18న గురువారం ఉద‌యం 10.30 నుండి 12 గంట‌ల వ‌ర‌కు స్న‌ప‌న తిరుమంజ‌నం, మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పుష్పయాగం జరుగనున్నాయి. ఇందులో పలురకాల పుష్పాలతో స్వామివారికి అభిషేకం చేస్తారు. ఆ తరువాత వీధి ఉత్సవం నిర్వహిస్తారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.