PAVITROTSAVAM POSTERS RELEASED_ శ్రీ కోదండరామస్వామివారి పవిత్రోత్సవాల గోడపత్రికలు ఆవిష్కరణ

Tirupati, 17 Jul. 19: The posters of annual Pavitrotsavam at Sri Kodandarama Swamy temple was released by Tirupati JEO Sri P Basant Kumar on Wednesday evening in Sri Kodandarama Swamy temple premises.

Speaking on the occasion the JEO said, the three day annual fete will be observed from July 28 to 30 with Ankurarpanam on July 27.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ కోదండరామస్వామివారి పవిత్రోత్సవాల గోడపత్రికలు ఆవిష్కరణ

జూలై 17, తిరుపతి, 2019: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాల గోడపత్రికలను బుధవారం సాయంత్రం టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పి.బసంత్‌ కుమార్‌ ఆవిష్కరించారు. ఆలయంలో జరిగిన ఆణివార ఆస్థానంలో పాల్గొన్న జెఈవో గోడపత్రికలను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ శ్రీ కోదండరామాలయంలో జూలై 28 నుండి 30వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నట్టు తెలిపారు. ఇందుకోసం జూలై 27న సాయంత్రం అంకురార్పణం జరుగనుందని చెప్పారు. ఆలయంలో భక్తుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలిసీతెలియక జరిగిన దోషాల నివారణ కోసం, ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు.

కాగా, పవిత్రోత్సవాల్లో భాగంగా మొదటిరోజు యాగశాలలో పవిత్ర ప్రతిష్ఠ, శయనాధివాసం, రెండో రోజు పవిత్ర సమర్పణ, యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. మూడో రోజు యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి. ప్రతిరోజూ ఉదయం స్నపనతిరుమంజనం, సాయంత్రం తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు. గ హస్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి పవిత్రోత్సవాల్లో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, చివరిరోజు ఒక పవిత్రం బహుమానంగా అందజేస్తారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.