APPLICATIONS FOR REGULAR COURSES _ జూన్ 16 నుండి ఎస్వీ సంగీత, నృత్య‌ కళాశాల, నాద‌స్వ‌ర పాఠ‌శాల‌లోప్రవేశాల‌కు దరఖాస్తుల ఆహ్వానం

Tirupati, 13 June 2022:  Applications are invited for admissions to all regular courses in the TTD – run SV College of Music and Dance from June 16 onwards. Last date of receiving application is June 30. The classes will commence from July 1 onwards.

For more details contact  7330811173  / 9391599995 during office hours in working days.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జూన్ 16 నుండి ఎస్వీ సంగీత, నృత్య‌ కళాశాల, నాద‌స్వ‌ర పాఠ‌శాల‌లోప్రవేశాల‌కు దరఖాస్తుల ఆహ్వానం

తిరుపతి, 2022 జూన్ 13: తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల, ఎస్వీ నాద‌స్వ‌రం, డోలు పాఠ‌శాల‌లో 2022-23 విద్యా సంవత్సరానికి గాను పలు రెగ్యుల‌ర్ కోర్సుల్లో ప్రవేశాల‌కు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. జూన్ 16వ తేదీ నుండి క‌ళాశాల‌లో ద‌ర‌ఖాస్తులు జారీ చేస్తారు. పూర్తిచేసిన ద‌ర‌ఖాస్తులను జూన్ నెలాఖ‌రు వ‌ర‌కు స్వీక‌రిస్తారు.

ఎస్వీ సంగీత, నృత్య కళాశాలలో గాత్రం, వ‌యోలిన్‌, వీణ‌, ఫ్లూట్‌, నాద‌స్వ‌రం, భ‌ర‌త‌నాట్యం, హ‌రిక‌థ‌, మృదంగం, డోలు, ఘ‌టం విభాగాల్లో ఫుల్‌టైమ్ విశార‌ద‌(డిప్లొమా), ప్ర‌వీణ‌(అడ్వాన్డ్స్ డిప్లొమా) కోర్సులు ఉన్నాయి. ఎస్వీ నాద‌స్వ‌రం, డోలు పాఠ‌శాల‌లో ఫుల్‌టైమ్ స‌ర్టిఫికేట్‌, డిప్లొమా కోర్సులు ఉన్నాయి. జులై 1వ తేదీ నుండి త‌ర‌గ‌తులు ప్రారంభ‌మ‌వుతాయి. ఇత‌ర ప్రాంతాల విద్యార్థుల‌కు హాస్ట‌ల్ వ‌స‌తి క‌ల్పించ‌డం జ‌రుగుతుంది.

ఆసక్తి గల అభ్యర్థులు కళాశాల పని వేళల్లో రూ.50/- చెల్లించి దరఖాస్తు పొందొచ్చు. ఇతర వివరాలకు 7330811173, 9391599995 నంబ‌ర్ల‌లో సంప్రదించగలరు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.