MALAYAPPA BLESSES DEVOTEES IN MUTYAPU KAVACHAM _ ముత్యపు కవచంలో మురిపించిన శ్రీ మలయప్ప

TIRUMALA, 13 JUNE 2022: On the second day of the ongoing annual Jyestabhishekam in Tirumala temple, Sri Malayappa Swamy adorned in Pearl Armour blessed His devotees on Monday evening.

Earlier during the day, Snapana Tirumanjanam was performed to the processional deities of Sri Malayappa, Sridevi and Bhudevi amidst the chanting of Vedic mantras between 9am and 11am. 

Later in the evening, Mutyapu Kavacham was adorned to Sri Malyaappa Swamy. The devotees had an opportunity to witness the deity in Pearl Armour which happens only once in a year.

Both the senior and junior pontiffs of Tirumala, TTD EO Sri AV Dharma Reddy, temple DyEO Sri Ramesh Babu and others were present.

GARUDA SEVA CANCELLED

In view of the annual Jyestabhishekam, the monthly Pournami Garuda Seva was cancelled by TTD on June 14.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ముత్యపు కవచంలో మురిపించిన శ్రీ మలయప్ప

తిరుమ‌ల‌, 2022 జూన్ 13: తిరుమల శ్రీవారి జ్యేష్ఠాభిషేకంలో భాగంగా రెండో రోజు సోమ‌వారంనాడు శ్రీదేవి భూదేవి స‌మేత శ్రీ మలయప్పస్వామివారు ముత్యపు కవచం ధరించి నాలుగు మాడ వీధులలో ఊరేగుతూ భక్తులను మురిపించాడు.

అంతకుముందు ఉదయం 6.30 గంటలకు శ్రీ మలయప్పస్వామివారు ఉభయనాంచారులతో కలిసి శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారానికి వేంచేపు చేశారు. ఉదయం 8 గంటలకు ఆలయ అర్చకులు మరియు వేదపారాయణదారులు శాస్త్రోక్తంగా మహాశాంతి హోమం నిర్వహించారు. అనంతరం ఉదయం 9 నుండి 11 గంటల వరకు శ్రీ మలయప్ప స్వామివారికి, దేవేరులకు అభిదేయక అభిషేకాన్ని కన్నులపండుగగా చేపట్టారు.

సాయంత్రం శ్రీ మలయప్పస్వామివారికి ముత్యపు కవచ సమర్పణ వేడుకగా జరిగింది. అనంతరం సహస్రదీపాలంకార సేవలో ఊయల మీద స్వామి ముత్యపు కవచంలో భక్తులను అనుగ్రహించాడు. కాగా సంవత్సరంలో ఒకమారు మాత్రమే ముత్యపు కవచాన్ని ధరించిన స్వామివారి ముగ్దమనోహర రూపాన్ని చూసి భక్తులు తన్మయత్వం చెందారు.

ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్దజీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి దంప‌తులు, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ ర‌మేష్‌బాబు, ఇత‌ర అధికారులు, భ‌క్తులు పాల్గొన్నారు.

జూన్ 14న పౌర్ణ‌మి గరుడసేవ రద్దు

తిరుమల శ్రీవారి ఆల‌యంలో జూన్ 14వ తేదీన‌ పౌర్ణమి గరుడసేవను టీటీడీ రద్దు చేసింది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా శ్రీవారికి గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే.

శ్రీ‌వారి వార్షిక జ్యేష్టాభిషేకం కార‌ణంగా పౌర్ణ‌మి గరుడసేవ జ‌ర‌గ‌దు. ఈ విషయాన్ని భక్తులు గమనించగలరు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.