APPOINTMENT OF VAIKHANASA AGAMA ADVISORY COMMITTEE _ వైఖానస ఆగమ సలహా కమిటీ నియామకం
Tirumala, 20 May 2025: As per the decision taken during the TTD Trust Board meeting held in March this year, the existing Vaikhanasa Agama Advisory Committee has been dissolved, and a new committee has been appointed.
The new Vaikhanasa Agama Advisory Committee comprises five members including Sri A.S. Sri Krishna Seshachalam Deekshitulu, Chief Priest of Sri Vari Temple, Dr. Parasharam Bhavanarayana Acharyulu, Assistant Professor, Department of Vaikhanasa Agama, SV Vedic University, Sri P.K. Varadhan Bhattacharyar from Chennai, Sri A. Ananthashayana Deekshitulu, Honorary Priest at Sri Govindaraja Swamy Temple, Sri A. Khadri Narasimhacharyulu, Former Priest.
The tenure of this new committee will be for a period of two years.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
వైఖానస ఆగమ సలహా కమిటీ నియామకం
తిరుమల, 2025 మే 20: గత మార్చి నెలలో జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు టీటీడీ ప్రస్తుత వైఖానస ఆగమ సలహా కమిటీని రద్దుచేసి, కొత్త కమిటీని నియమించింది. ఐదుగురు సభ్యులతో కూడిన కొత్త వైఖానస ఆగమ సలహా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది.
శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ ఎ.ఎస్.శ్రీ కృష్ణ శేషాచలం దీక్షితులు, ఎస్వీ వేద విశ్వవిద్యాలయంలోని వైఖానస ఆగమ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.పరాశరం భవనారాయణాచార్యులు, చెన్నైకు చెందిన శ్రీ పీ.కే.వరదన్ భట్టాచార్యార్, శ్రీ గోవిందరాజ స్వామి దేవాలయంలోని సంభావన అర్చకులు శ్రీ ఏ.అనంతశయన దీక్షితులు, మాజీ అర్చకులు శ్రీ ఏ.ఖద్రీ నరసింహాచార్యులను నూతన ఆగమ సలహా కమిటీలో సభ్యులుగా నియమించడం జరిగింది. వీరి పదవీకాలం రెండేళ్ల పాటు కొనసాగనుంది.
టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.