ARJITA SEVA DEVOTEES PERMITTED WITH COVID CERTIFICATES FROM APRIL 14 _ ఏప్రిల్ 14 నుండి శ్రీ‌వారి ఆర్జిత సేవ‌ల‌కు భ‌క్తుల‌కు అనుమ‌తి

  • VISHESHA PUJA AND SHASRA KALASABHISHEKAM TO BE ANNUAL CIRCAR SEVAS 
  • VASANTHOTSAVAM ALSO AS ANNUAL UTSAVAM

Tirumala, 23 Mar. 21:  After a year of Covid restrictions the TTD has announced on Tuesday that devotees will be permitted for Arjita sevas from April 14 onwards but with Covid negative certificates only.

Few of these arjita sevas are now performed on a virtual basis now.

The Grihastas coming for all Arjita sevas and Utsavas have to compulsorily submit only three days old Covid-19 negative certificates at the Vaikuntam Queue Complex, TTD said categorically.

As part of a special drive to protect the Srivari Utsava Idols from excess-usage, TTD has also decided to convert the weekly sevas Vishesha Pooja (Monday’s) and Sahasra Kalasabhishekam (Wednesdays) into annual sevas. Both the unique Arjita sevas will henceforth be performed at the Srivari temple once in a year that too as Circar Seva. Similarly, the Festival of Vasantothsavam will also be performed as an annual Seva.

For the devotees who have hither-too booked these three arjita sevas are now given the option to either claim refund or a one-time option to get the facility of VIP break Darshan.

TTD will soon inform the devotees on the process of choice of dates for Break Darshan or the refund claims in connection with the above three arjita sevas.

TTD has also provided the option of Break Darshan or refund claim for arjita sevas, which were booked in advance online between March 20 of 2020 to April 13 of 2021 during the COVID-19 period.

The arjita sevas with similar options included Suprabatham Tomala, Archana, Astadala Pada padmaradhana, Sahasra Kalasabhishekam, Tiruppavada, Melchat Vastrams, Purabhisekam, Civet Vessel, Kasturi Vessel, and Nija Pada Darshana etc. The devotees could opt for either Break Darshan or a refund claim.

TTD has taken the above decision to further facilitate devotees with Srivari Darshan, as during the Covid-19 situation all these days, it was not possible to allow devotees to avail these arjita sevas.

The dates for the process of refund and option of break Darshan for above arjita sevas booked online in advance will be announced soon, TTD said in a statement.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI 

ఏప్రిల్ 14 నుండి శ్రీ‌వారి ఆర్జిత సేవ‌ల‌కు భ‌క్తుల‌కు అనుమ‌తి

కోవిడ్‌-19 నెగెటివ్ స‌ర్టిఫికేట్‌ త‌‌ప్ప‌నిస‌రి

ఏడాదికోసారి స‌ర్కార్ సేవ‌లుగా విశేష‌పూజ‌, స‌హ‌స్ర‌క‌ల‌శాభిషేకం

సాల‌క‌ట్ల ఉత్స‌వంగా వ‌సంతోత్స‌వం


తిరుమ‌ల, 2021 మార్చి 22: ఏప్రిల్ 14వ తేదీ నుండి తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో ఆర్జిత సేవ‌ల‌కు/ఉత‌్స‌వాలకు భ‌క్తుల‌ను అనుమ‌తిస్తామ‌ని టిటిడి మంగళవారం ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

ఆర్జిత సేవ‌లు/ఉత‌్స‌వాల్లో పాల్గొనే గృహ‌స్తులు కోవిడ్‌-19 నిబంధ‌న‌లు పాటించాల‌ని టిటిడి విజ్ఞ‌ప్తి చేస్తోంది. గృహ‌స్తులు సేవ‌కు మూడు రోజులు ముందు ప‌రీక్ష చేయించుకుని కోవిడ్‌-19 నెగెటివ్ స‌ర్టిఫికేట్‌ను వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వ‌ద్ద త‌‌ప్ప‌నిస‌రిగా స‌మ‌ర్పించాల‌ని స్ప‌ష్టం చేసింది.

ఉత్స‌వ‌మూర్తుల‌ను సంర‌క్షించ‌డంలో భాగంగా ప్ర‌తి సోమ‌వారం నిర్వ‌హించే విశేష‌పూజ‌, ప్ర‌తి బుధ‌వారం నిర్వ‌హించే స‌హ‌స్ర‌క‌ల‌శాభిషేకం సేవ‌ల‌ను ఇక‌పై సంవ‌త్స‌రానికి ఒక‌సారి స‌ర్కార్ సేవ‌లుగా నిర్వ‌హించాల‌ని టిటిడి నిర్ణ‌యించింది. అదేవిధంగా, వ‌సంతోత్స‌వాన్ని సంవ‌త్స‌రానికి ఒక‌సారి సాల‌క‌ట్ల ఉత్స‌వంగా నిర్వ‌హించనుంది. ఈ మూడు సేవ‌ల‌ను ముంద‌స్తుగా బుక్ చేసుకున్న భ‌క్తులు వీటికి బ‌దులుగా బ్రేక్ ద‌ర్శ‌నం లేదా స‌ద‌రు టికెట్ మొత్తాన్ని రీఫండ్ పొందే స‌దుపాయాన్ని టిటిడి క‌ల్పించింది. బ్రేక్ ద‌ర్శ‌నం టికెట్లు విడుద‌ల చేసే తేదీల‌ను, రీఫండ్ పొందాల్సిన‌ తేదీల‌ను త్వ‌ర‌లో తెలియ‌జేయ‌డం జ‌రుగుతుంది.

అదేవిధంగా, 2020 మార్చి 20 నుండి 2021 ఏప్రిల్ 13వ తేదీ వ‌ర‌కు సుప్ర‌భాతం, తోమాల‌, అర్చ‌న‌, అష్ట‌ద‌ళ‌పాద‌ప‌ద్మారాధ‌న, స‌హ‌స్ర‌క‌ళ‌శాభిషేకం, తిరుప్పావ‌డ‌, మేల్‌చాట్ వ‌స్త్రం, పూరాభిషేకం, పునుగు పాత్ర‌, క‌స్తూరి పాత్ర‌, నిజ‌పాద‌ద‌ర్శ‌నం ఆర్జిత సేవా టికెట్ల‌ను బుక్ చేసుకున్న భ‌క్తులు వీటికి బ‌దులుగా బ్రేక్ ద‌ర్శ‌నం లేదా స‌ద‌రు టికెట్ మొత్తాన్ని రీఫండ్ పొందే స‌దుపాయాన్ని టిటిడి క‌ల్పించింది. కోవిడ్‌-19 నేప‌థ్యంలో ఈ సేవ‌ల‌కు భ‌క్తుల‌ను అనుమ‌తించడం సాధ్యం కాని ప‌రిస్థితుల్లో టిటిడి ఈ నిర్ణ‌యం తీసుకుంది. బ్రేక్ ద‌ర్శ‌నం టికెట్లు విడుద‌ల చేసే తేదీల‌ను, రీఫండ్ పొందాల్సిన‌ తేదీల‌ను త్వ‌ర‌లో తెలియ‌జేయ‌డం జ‌రుగుతుంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.