ARTISTS INVITED BY TTD FOR SRI PAT BTU _ శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల్లో ప్ర‌ద‌ర్శ‌న‌ల‌కు ప్ర‌తిభ గ‌ల క‌ళాకారుల‌కు ఆహ్వానం

Tirupati, 12 Nov. 19: TTD has rolled out mega cultural programs with celebrity artists for the ensuing Sri Padmavati Amma Vari Brahmmotsavams, Tiruchanoor from November 23 to December 1.

TTD has geared up a colourful Bowie of Cultural programs including classic, Bhakti, instrument music, Annamaiah, Dasa Sahitya, Tyagaraya, Ramadasu sankeertans, Kuchipudi, Bharatanatyam dances, Harikatha, Burra Katha, janapada arts, dance ballets etc. in Vahanam, kolatas, Pandaripuram bhajans, pillangrovi etc.

Artists with skills in a over art forms and aged 15-40 years are advised to send profiles, certificates and one minute video cum audio cds to Annamacharya project- 9885261236, 970041490, Dasa Sahitya -8601005051, 7013324188 and HDPP- 9618640333. Interested artists should send their profiles to TTD experts committee before November 15 for approval.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల్లో ప్ర‌ద‌ర్శ‌న‌ల‌కు ప్ర‌తిభ గ‌ల క‌ళాకారుల‌కు ఆహ్వానం

న‌వంబ‌రు 12, తిరుప‌తి, 2019: తిరుచానూరులోని శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యంలో న‌వంబ‌రు 23 నుండి డిసెంబ‌రు 1వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌నున్న బ్ర‌హ్మోత్స‌వాల్లో క‌ళాప్ర‌ద‌ర్శ‌న‌లు ఇచ్చేందుకు ప్ర‌తిభ గ‌ల క‌ళాకారుల‌కు టిటిడి ఆహ్వానం ప‌లుకుతోంది.

బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా తిరుప‌తిలోని వివిధ వేదిక‌ల్లో 1. శాస్ర్తీయ‌సంగీతం, భ‌క్తిసంగీతం, వాయిద్య సంగీతం(అన్న‌మ‌య్య‌, దాస‌సాహిత్య‌, త్యాగ‌రాయ‌, రామ‌దాసు సంకీర్త‌న‌లు), 2. కూచిపూడి నృత్యం, భ‌ర‌త‌నాట్యం, నృత్య‌రూప‌కం, 3. హ‌రిక‌థాగానం, బుర్ర‌క‌థ‌, జాన‌ప‌ద‌క‌ళ‌లు, 4. వాహ‌న‌సేవ‌ల్లో కూచిపూడి, భ‌ర‌త‌నాట్యం, నృత్య‌రూప‌కం, కోలాటం, పండ‌రిభ‌జ‌న‌, పిల్ల‌న‌గ్రోవి, గ‌ర‌గ‌ల‌భ‌జ‌న త‌దిత‌ర క‌ళాప్ర‌ద‌ర్శ‌న‌లు ఏర్పాటు చేస్తారు.

పై క‌ళ‌ల్లో ప్ర‌తిభ ఉండి 15 నుండి 40 ఏళ్ల‌లోపు గ‌ల క‌ళాకారులు త‌మ బ‌యోడేటా, ప‌త్రికా ప్ర‌శంస‌లు, 5 నిమిషాలు నిడివి గ‌ల వీడియో ప్ర‌ద‌ర్శ‌న‌లను ఈ కింద‌గ‌ల ఏదో ఒక‌ నంబ‌రుకు వాట్సాప్ చేయాల్సిందిగా కోర‌డ‌మైన‌ది. 1. అన్న‌మాచార్య ప్రాజెక్టు – 9885261236, 9700471490, 2. దాస‌సాహిత్య ప్రాజెక్టు – 8501005051, 7013324188, 3. హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్తు – 9618640333. ఆస‌క్తి గ‌ల క‌ళాకారులు న‌వంబ‌రు 15వ తేదీలోపు పంపాల‌ని కోర‌డ‌మైన‌ది. నిపుణుల క‌మిటీ ప‌రిశీలించిన అనంత‌రం ఎంపికైన క‌ళాకారుల‌కు స‌మాచారం తెలియ‌జేస్తారు. ప్ర‌తిభ గ‌ల క‌ళాకారులకు ప్రాధాన్యం ఇస్తారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.