POURNAMI GARUDA SEVA OBSERVED _ వైభ‌వంగా కార్తీక‌ పౌర్ణమి గరుడసేవ

Tirumala, 12 Nov. 19: The monthly Pournami Garuda Seva has been observed with religious fervor in Tirumala on Tuesday evening. 

The processional deity of Sri Malayappa Swamy in all His religious splendour took out a celestial ride on the finely decked Garuda Vahanam along the four mada streets between 7pm and 9pm. 

Addl EO Sri AV Dharma Reddy, Temple DyEO Sri Haridranath, VGO Sri Manohar and Devotees took part in large numbers to witness the vahana seva. 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

 

వైభ‌వంగా కార్తీక‌ పౌర్ణమి గరుడసేవ

న‌వంబ‌రు 12, తిరుమల, 2019: తిరుమలలో మంగ‌ళ‌వారం రాత్రి కార్తీక‌పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడసేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
 
ఇందులో భాగంగా రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్పస్వామివారు త‌న‌కు ఎంతో ప్రీతిపాత్ర‌మైన గరుడ వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ధ‌ర్మారెడ్డి, శ్రీ‌వారి ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌, విఎస్‌వో శ్రీ మ‌నోహ‌ర్ ఇత‌ర అధికారులు, విశేషంగా భ‌క్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.