ARTISTS INVITED TO PERFORM AT NADA NEERAJANAM _ నాదనీరాజనంపై ప్రదర్శించేందుకు కళాకారుల నుండి దరఖాస్తులు ఆహ్వానం
Tirumala, 25 Mar. 21:TTD’s Hindu Dharma Prachara Parishad on Thursday has called for applications from artists to perform at the Nada Neeranjanam platform.
TTD has invited artists (not more than 10 per day) to perform at the platform in front of the Srivari temple during Stotra Parayanams of Vishnu Sahasra Nama parayanams from morning 09.00 am-1.00 pm in the afternoon.
Artists with skills in Music, dance, instrumental music- violin, flute, Veena, Nadaswaram, mridangamgam, Dolu, and Ghatam and others and ready to perform at the platform free of cost, should apply.
TTD agenda is to promote cultural programs and also artists. Artists with certificates in Music (degree/ Visharada/ Pravina/ PG/ Diploma) certificates could apply and TTD will provide them an opportunity on par with their skills and certificates.
The selected artists would be provided free accommodation, food and Srivari Darshan.
The applicants should mention“ for Nada Neeranjanam platform “ on cover their applications and send it to “ The Secretary, HDPP, SVETA Bhavan, Tirupati-517502.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
నాదనీరాజనంపై ప్రదర్శించేందుకు కళాకారుల నుండి దరఖాస్తులు ఆహ్వానం
తిరుమల, 2021 మార్చి 25: తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా గల నాదనీరాజనం వేదికపై ప్రదర్శించేందుకు ఆసక్తిగల కళాకారుల నుండి టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నాదనీరాజనం వేదికపై ప్రతిరోజూ ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు స్తోత్ర పారాయణం, విష్ణుసహస్రనామ పారాయణం(10 మందికి మించకుండా), సంగీతం, నృత్యం, వయోలిన్, వీణ, వేణువు, నాదస్వరం, మృదంగం, డోలు ఘటం తదితర కళలను స్వామివారి ముందు ఉచితంగా ప్రదర్శించేందుకు ఔత్సాహికులైన కళాకారుల నుండి ఈ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. కళలను ప్రోత్సహించేందుకు, సంస్కృతిని పరిరక్షించేందుకు ఈ కార్యక్రమం దోహదకారి కావాలని టీటీడీ ఈ మేరకు ప్రయత్నం చేపట్టింది. సంగీతంలో డిగ్రీ/ విశారద/ ప్రవీణ/ పీజీ/ డిప్లొమా సర్టిఫికెట్ కోర్సులు ఉత్తీర్ణత పొందిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. పాల్గొన్న కళాకారులకు భోజనం, వసతిసదుపాయం, స్వామివారి దర్శనం కల్పించడం జరుగుతుంది. దరఖాస్తు చేసుకున్న వారికి అర్హతను బట్టి అవకాశం కల్పిస్తారు. దరఖాస్తుపై “ నాదనీరాజనం వేదిక కొరకు” అని రాసి “ కార్యదర్శి, హిందూ ధర్మప్రచార పరిషత్, తిరుమల తిరుపతి దేవస్థానములు, శ్వేత భవనం, తిరుపతి – 517502” అనే చిరునామాకు పంపాల్సి ఉంటుంది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.