ARTISTS SHINE AT SIMHA VAHANA SEVA _ సింహ వాహనసేవ‌లో క‌ళాకారుల కోలాహ‌లం

Tirumala, 29 September 2022: On third day of the ongoing Srivari salaktla Brahmotsavams, over 15 cultural teams from different regions enthralled the devotees sitting in the galleries of Mada streets.

Among the stellar performances were Puducherry artists who rendered Oliyattam, traditional bhajan with long sticks, Bharata Natyam by Karnataka artists and Kolatas by Maharashtra artists.

Similarly, Nasik drum teams from Mallepally of East Godavari districts, Aghora dance, Dance by Bhubaneswari bhajan mandali, Sri Krishna team of Anantapur presented Traditional dance, dance by Bangalore and Tirupati teams.

Finally Kolatas and bhajan by artists of Visakhapatnam, Chakka bhajan by artists of Mahboobnagar, Pillangrovi dance by artists of Annamaiah district enthralled the devotees.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

2022 శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలు

సింహ వాహనసేవ‌లో క‌ళాకారుల కోలాహ‌లం

తిరుమల, 2022 సెప్టెంబ‌రు 29: శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు గురువారం ఉద‌యం శ్రీ మలయప్పస్వామివారు సింహ వాహనంపై దర్శనమిచ్చారు. మాడ వీధుల్లో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగిన వాహ‌న‌సేవ‌లో వివిధ ప్రాంతాలకు చెందిన 15 క‌ళాబృందాలు ప్ర‌ద‌ర్శ‌న‌లిచ్చాయి.

ఇందులో పుదుచ్చేరికి క‌ళాకారులు ఓళియాట్టం, పొడుగు క‌ర్ర‌ల‌తో చేసిన సంప్ర‌దాయ భ‌జ‌న‌, క‌ర్ణాట‌క క‌ళాకారుల భ‌ర‌త‌నాట్యం, మ‌హారాష్ట్ర క‌ళాకారులు కోలాటం భ‌జ‌న ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి.

అదేవిధంగా, తూర్పుగోదావ‌రి జిల్లా మ‌ల్లేప‌ల్లికి చెందిన మారుతి నాసిక్ డోలు బృందం అఘోరా నృత్యం, భువ‌నేశ్వ‌రి భ‌జ‌న మండ‌లి తాళాల‌తో చేసిన నృత్యం, అనంత‌పురానికి చెందిన శ్రీ‌కృష్ణ బృందం సంప్ర‌దాయ నృత్యం, బెంగ‌ళూరుకు చెందిన కైలాస‌ధ‌ర బృందం నృత్యం, తిరుప‌తికి చెందిన ఆనంద‌నిల‌య‌వాసా భ‌జ‌న మండ‌లి నృత్య కార్య‌క్ర‌మాలు అల‌రించాయి.

వీటితోపాటు విశాఖ‌ప‌ట్నం, అన‌కాప‌ల్లి, విశాఖ‌, తిరుమ‌ల‌, తిరుప‌తి క‌ళాకారుల కోలాటం భ‌జ‌న‌, తెలంగాణ రాష్ట్రం మ‌హ‌బూబ‌ర్ న‌గ‌ర్ క‌ళ‌కారుల చెక్క‌భ‌జ‌న‌, అన్న‌మ‌య్య జిల్లా క‌ళాకారుల పిల్ల‌న‌గ్రోవి నృత్యం భ‌క్తుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.