ASTABANDHANA BALALAYA MAHA SAMPROKSHANAM IN TIRUMALA TEMPLE FROM AUGUST 12 TO 16_ డయల్ యువర్ ఈవో ముఖ్యాంశాలు
Tirumala, 6 July 2018: As Astabandhana Balalaya Maha Samprokshanam, unique temple ritual, observed in Tirumala from August 12 to 16, the possibility of providing darshan to pilgrims will be minimum during these days and hence the pilgrims are requested to plan their pilgrimage accordingly, said TTD EO Sri Anil Kumar Singhal.
Briefing media persons, the EO said, this month TTD will provide darshan tokens to 4000 pilgrims falling under the category of aged people and Physically Handicapped pilgrims on two lean days on July 10 and 24 while. He said, the parents with children below 5 years of age also will be allowed for darshan on July 11 and 25.
This year we will be reviewing on annual brahmotsavam arrangements much before so as to complete all our engineering works by August 31. Our meeting with District Collector, SP and other departments in the district which are related to the mega religious event will also take part on July 26.
Sri Venkateswara Swamy temple which was recently opened at Kurukshetra has been attracting thousands of devotees every day. Similarly the temples at Kanyakumari and Hyderabad are also gearing up for inauguration in the beginning of next year.
Arjitha Seva Tickets available in on-line for the month of October 53,642
On-line dip are 9,742 which includes, Suprabhatam-7,597, Thomala and Archana-90 each, Astadalam-240, Nijapadam-1,725.
While in General category the total no of tickets released are 43,900 which includes, Viseshapuja-2,000, Kalyanam-9,975, Unjal seva-3,150, Arjitha Brahmotsavam-5,775, Vasanthotsavam-11,000, Sahasra Deepalankara Seva-12,000.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
డయల్ యువర్ ఈవో ముఖ్యాంశాలు
జూలై 06, తిరుమల 2018: డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ముందుగా టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ భక్తులను ఉద్దేశించి ప్రగించారు. ఆ వివరాలు వారి మాటల్లోనే…
శ్రీవారి ఆలయంలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ :
– తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతి 12 సంవత్సరాలకోసారి నిర్వహించే అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణం ఆగస్టు 12 నుండి 16వ తేదీ వరకు నిర్వహిస్తాం. ఋత్వికులు, వేద పండితులు, ప్రబంధ పండితులు, వేద విద్యార్థులు పాల్గొంటారు.
– ఆగస్టు 12 నుండి 16వ తేదీ వరకు ఆర్జితసేవలన్నీ రద్దు చేశాం. ఆగస్టు 15న మహాశాంతి తిరుమంజనం నిర్వహిస్తాం. ఆగస్టు 16న ఉదయం 10.16 గంటలకు తులా లగ్నంలో మహాసంప్రోక్షణ చేపడతాం. మహాసంప్రోక్షణ జరిగే 5 రోజుల్లో పరిమితంగా భక్తులకు దర్శనం చేయించే అవకాశముంటుంది. ఈ విషయాన్ని ద ష్టిలో ఉంచుకుని భక్తులు తమ తిరుమలయాత్రకు ప్రణాళిక రూపొందించుకోవాలని కోరుతున్నాం.
ప్రత్యేక దర్శనాలు :
– వేసవి సెలవుల అనంతరం వ ద్ధులు, దివ్యాంగులు, 5 ఏళ్ల లోపు చంటిపిల్లల తల్లిదండ్రులకు నెలలో 2 రోజుల పాటు కల్పించే ప్రత్యేక దర్శన సౌకర్యాన్ని తిరిగి అమలుచేస్తున్నాం. ఇందులో భాగంగా జూలై 10, 24వ తేదీల్లో వ ద్ధులు, దివ్యాంగులకు, జూలై 11, 25వ తేదీల్లో 5 ఏళ్ల లోపు చంటిపిల్లలకు, వారి తల్లిదండ్రులకు దర్శనం కల్పిస్తాం.
– ఈ అవకాశాన్ని వ ద్ధులు, దివ్యాంగులు, 5 ఏళ్ల లోపు చంటిపిల్లల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం.
భక్తులకు టైంస్లాట్ దర్శనం :
– టైంస్లాట్ విధానం ద్వారా శ్రీవారి భక్తులు ఎక్కువ సమయం కంపార్ట్‌మెంట్లలో వేచి ఉండకుండా నిర్దేశిత సమయంలో స్వామివారిని దర్శించుకుంటున్నారు. జూన్ నెలలో దాదాపు 22 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఇందులో : సమయ నిర్దేశిత సర్వదర్శనం – 5,24,572, దివ్యదర్శనం- 5,34,022, ప్రత్యేక ప్రవేశ దర్శనం – 4,94,968, సర్వదర్శనం – 6,44,691.
– సర్వదర్శనం టోకెన్ల కోసం కుటుంబ సభ్యులందరూ ఆధార్ కార్డు లేదా ఓటర్ కార్డు తీసుకురావాలి. నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలైన్లలోకి చేరుకోవాలి. భక్తులు ఖాళీ సమయంలో తిరుపతి, తిరుమలలోని సందర్శనీయ ప్రాంతాలను సందర్శించేలా కరపత్రాలను ముద్రించి పంపిణీ చేస్తున్నాం.
జూలై 26న శ్రీవారి బ్రహ్మూెత్సవాలపై సమావేశం :
– శ్రీవారి బ్రహ్మూెత్సవాల ఏర్పాట్లపై జూలై 26వ తేదీన సమావేశం నిర్వహిస్తాం. ఆగస్టు 31వ తేదీలోపు ఇంజినీరింగ్ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించాం.
కురుక్షేత్రలో శ్రీవారి ఆలయం :
– హర్యానా రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కురుక్షేత్రలో నిర్మించిన శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూలై 1వ తేదీ నుండి భక్తులకు దర్శనం కల్పిస్తున్నాం. రోజుకు 2 వేల మందికిపైగా భక్తులు ఆలయాన్ని సందర్శిస్తున్నారు.
– కన్యాకుమారి, హైదరాబాద్ నగరాల్లో శ్రీవారి ఆలయ నిర్మాణపనులు వేగవంతంగా జరుగుతున్నాయి.
– అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వ ఆదేశాలు అందాక మాస్టర్‌ప్లాన్ రూపొందించి పనులు చేపడతాం.
మరుగుదొడ్లు :
– తిరుమలలో మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా భక్తుల సౌకర్యార్థం మాడవీధులు, నారాయణగిరి ఉద్యానవనాలు, ఇతర ప్రధాన ప్రాంతాలలో రూ.26 కోట్లతో మరుగుదొడ్ల నిర్మాణానికి టెండర్లు పూర్తయ్యాయి. శ్రీవారి బ్రహ్మూెత్సవాలలోపు వీలైనన్ని మరుగుదొడ్లను భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తాం. వైకుంఠ ఏకాదశి నాటికి పూర్తిస్థాయిలో మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేస్తాం.
అలిపిరి నడక మార్గంలో పూల మొక్కల పెంపకం :
– అలిపిరి నడకమార్గంలో భక్తులకు ఆహ్లాదకరంగా ఉండేలా 5 వేల రంగురంగుల పూలమొక్కలు, 5 వేల సుగంధ మొక్కలు నాటాం. రానున్న నాలుగు నెలల్లో నడకమార్గం మరింత ఆహ్లాదంగా మారుతుంది. ఇందుకు కృషి చేసిన అటవీ విభాగం సిబ్బందికి అభినందనలు.
కాల్‌సెంటర్ సిబ్బందికి శిక్షణ :
– శ్రీవారి భక్తులకు దర్శనం, వసతి, రవాణా తదితర అంశాలపై మరింత మెరుగ్గా తాజా సమాచారాన్ని అందించేలా కాల్ సెంటర్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.
దర్శనం :
– గతేడాది జూన్‌లో 25.8 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా ఈ ఏడాది ఫిబ్రవరిలో 24.6 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు.
హుండీ ఆదాయం :
– శ్రీవారి హుండీ ఆదాయం గతేడాది జూన్‌లో రూ.86.45 కోట్లు కాగా, ఈ ఏడాది జూన్‌లో రూ.93.75 కోట్లు వచ్చింది.
అన్నప్రసాదం :
– గతేడాది జూన్‌లో 68.11 లక్షల మంది భక్తులకు అన్నప్రసాదం అందివ్వగా, ఈ ఏడాది జూన్‌లో 64.05 లక్షల మంది భక్తులకు అందజేయడం జరిగింది.
లడ్డూలు :
– గతేడాది జూన్‌లో ఒక కోటి 74 వేల లడ్డూలు అందించగా, ఈ ఏడాది జూన్‌లో 99.96 లక్షల లడ్డూలను అందించారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.