PUBLISH MYTHOLOGICAL CARTOON BOOKS TO LURE CHILDREN_ ఆన్‌లైన్‌లో 53,642 శ్రీవారి ఆర్జితసేవా టికెట్లు విడుదల :’డయల్‌ యువర్‌ ఈవో’లో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

Tirumala, 6 July 2018: TTD should print and publish cartoon books and reader-friendly books for common people to better under stand the History of Tirumala temple, Lord Venkateswara etc., advised a pilgrim caller Sri Geetaprasad from Hubli of Karnataka.

The monthly Dial Your EO programme was held at Annamaiah Bhavan in Tirumala on Friday. The EO Sri Anil Kumar Singhal attended the calls from 16 pilgrim callers across the country.

During the programme, the caller suggested EO that, though there are many publications by TTD, they are reaching only intellectual and scholarly section of the people. But for the easy and better understanding of children and common people, TTD might plan comic books and mythological books in easy language.

Welcoming the suggestion, the EO said, TTD has already reviewed on the subject and soon comic books as well as animated mythological series will be aired in SVBC.

Another caller from Vijayawada Sri Siddhartha sought EO to perform Metlotsavam, for which he said, the programme for the same will be planned and executed seeing the possibility under the supervision of Tirupati JEO Sri P Bhaskar soon.

A senior citizen Sri Seshakumar from Bengaluru brought to the notice of TTD EO to streamline the queue system for PHC and aged person line at scanning point. He also sought EO to provide mini bus facility to drop this category of pilgrims back to museum point after completing darshan.

Later clearing the doubts of pilgrim callers Sri Vinay from Bengaluru, Sri Bhavanarayana from Guntur, Dr Raghunatha Reddy from Hyderabad, the EO said, the present dip system is a transparent mechanism.

A caller Sri Praveen from Chennai said, TTD should find out a mechanism to avoid taking photos of pachyderms after the procession of deities in front of Tirumala temple as it might pose danger. The EO ensured of necessary action.

Another caller Sri Venkateswara Rao from Chennai sought EO to provide certain quota to Senior Citizens to have Vaikuntha Dwara Darshan on Vaikuntha Ekadasi day.

Some other callers brought to the notice of EO certain issues related to local temples at Sri Kodanda Rama Swamy temple, Tiruchanoor, Annamacharya Kalamandiram etc.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

ఆన్‌లైన్‌లో 53,642 శ్రీవారి ఆర్జితసేవా టికెట్లు విడుదల :’డయల్‌ యువర్‌ ఈవో’లో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

జూలై 06, తిరుమల 2018: శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించిన అక్టోబరు నెల కోటాలో మొత్తం 53,642 టికెట్లను శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేసినట్లు టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. ఆన్‌లైన్‌ డిప్‌ విధానంలో 9,742 సేవా టికెట్లు విడుదల చేశామని, ఇందులో సుప్రభాతం 7,597, తోమాల 90, అర్చన 90, అష్టదళపాదపద్మారాధన 240, నిజపాద దర్శనం 1,725 టికెట్లు ఉన్నాయని ప్రకటించారు. ఆన్‌లైన్‌లో జనరల్‌ కేటగిరిలో 43,900 సేవాటికెట్లు ఉండగా, వీటిలో విశేషపూజ 2000, కల్యాణం 9,975, ఊంజల్‌సేవ 3,150, ఆర్జితబ్రహ్మూెత్సవం 5,775, వసంతోత్సవం 11,000, సహస్రదీపాలంకారసేవ 12,000 టికెట్లు ఉన్నాయని వివరించారు.

తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం జరిగింది. ఇందులో పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలకు ఈవో సమాధానాలు ఇచ్చారు.

1. డా|| రఘునాథరెడ్డి – హైదరాబాద్‌, బాలాజి – కృష్ణగిరి, భావనారాయణ – గుంటూరు, వినయ్‌ – బెంగళూరు.

ప్రశ్న: ఆన్‌లైన్‌ డిప్‌ విధానంలో ఆర్జితసేవా టికెట్లు లభ్యం కావట్లేదు. 50 శాతం టికెట్లు మొదట బుక్‌ చేసుకున్న వారికి మొదట అనే ప్రాతిపదికన పాత విధానంలో కేటాయించండి?

ఈవో : భక్తుల కోరిక మేరకు మరింత పారదర్శకంగా ఆర్జిత సేవలను కేటాయించేందుకు ఆన్‌లైన్‌ డిప్‌ విధానాన్ని అమలుచేస్తున్నాం. ఆర్జితసేవలు పరిమితంగా ఉన్నాయి. లక్ష మందికిపైగా భక్తులు నమోదు చేసుకుంటున్నారు. పోటీ అధికంగా ఉండడం వల్ల భక్తులందరికీ సేవాటికెట్లు దొరకడం లేదు. ఈ విధానంపై ఎక్కువ మంది భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

2. శ్రీనివాస్‌ – నిజామాబాద్‌.

ప్రశ్న: పరకామణి సేవకు ప్రయివేటు ఉద్యోగులకు అవకాశం కల్పించండి?

ఈవో : ఎక్కువ మంది భక్తుల సూచనల మేరకు తగిన నిర్ణయం తీసుకుంటాం.

3. ప్రవీణ్‌ – చెన్నై.

ప్రశ్న: తిరుమలను పరిశుభ్రంగా ఉంచుతున్నందుకు టిటిడికి అభినందనలు, జపాలి తీర్థం వద్ద దూరాన్ని తెలిపే బోర్డు పెట్టండి. సీతమ్మధార వద్ద చెత్త పేరుకుపోతోంది. గజరాజుల వద్ద ఆశీర్వాదం కోసం డబ్బులు వసూలు చేస్తున్నారు. పుష్కరిణి వద్ద మహిళల మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉన్నాయి?

ఈవో : దేవాదాయ శాఖ అధికారులకు సమాచారం తెలియజేసి జపాలి తీర్థం వద్ద తగిన చర్యలు తీసుకుంటాం. గజరాజుల ఆశీర్వాదానికి డబ్బులు తీసుకుంటున్న విషయంపై విజిలెన్స్‌ అధికారులతో విచారణ జరిపిస్తాం. మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకుంటాం.

4. వేంకటేశ్వర్లు – చెన్నై.

ప్రశ్న: వైకుంఠ ఏకాదశి రోజున శ్రీవారిని దర్శించుకునేందుకు వృద్ధులకు ఆన్‌లైన్‌లో పరిమిత సంఖ్యలో టికెట్లు కేటాయించండి?

ఈవో : వైకుంఠ ఏకాదశి రోజున భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. మీ సూచనపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తాం.

5. రాంబాబు – కృష్ణా.

ప్రశ్న: జూన్‌ 15న తిరుమలకు వచ్చాం. అన్నప్రసాద భవనం వద్ద మా బ్యాగు చోరీకి గురైంది. అక్కడ సిసి కెమెరాలు కూడా లేవు. క్యూలైన్లలో ఉన్నపుడు మరుగుదొడ్లకు వెళ్లేందుకు భద్రతా సిబ్బంది అనుమతించలేదు?

ఈవో : మొదటి దశలో శ్రీవారి ఆలయం, మాడ వీధుల్లో 200కు పైగా ఆధునిక సిసి కెమెరాలు ఏర్పాటుచేశాం. రెండో దశలో ఇతర ప్రాంతాలకు విస్తరించి చోరీలు జరగకుండా పటిష్టమైన నిఘా పెడతాం. క్యూలైన్లు, కంపార్ట్‌మెంట్లలో భక్తులు మరుగుదొడ్లకు వెళ్లేందుకు సహకరించేలా అక్కడి సిబ్బందికి తగిన ఆదేశాలిస్తాం.

6. సిద్ధార్థ్‌ – విజయవాడ

ప్రశ్న: తెలుగు రాష్ట్రాల్లోని భజనమండళ్లతో మరోసారి మెట్లోత్సవం నిర్వహించండి?

ఈవో : ప్రస్తుతం టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో సంవత్సరానికి మూడు సార్లు మెట్లోత్సవం నిర్వహిస్తున్నాం. హిందూ ధర్మప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టు సంయుక్త ఆధ్వర్యంలో మరోసారి భజనమండళ్లతో మెట్లోత్సవం నిర్వహించే విషయమై పరిశీలిస్తాం.

7. కృష్ణ – తిరుపతి

ప్రశ్న: తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో శయనమందిరం నుండి అభిషేకాన్ని దర్శించే అవకాశాన్ని పునరుద్ధరించండి?

ఈవో : ఆలయాన్ని పరిశీలించి తగిన చర్యలు చేపడతాం.

8. వెంకట్రామయ్య – తిరుపతి

ప్రశ్న: తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో మధ్యాహ్నం వేళ ప్రసాద వితరణను నిలిపేశారు, పూజలు సక్రమంగా నిర్వహించేందుకు అర్చకుడిని నియమించండి?

ఈవో : అన్నమాచార్య కళామందిరాన్ని తనిఖీ చేసి తగిన చర్యలు తీసుకుంటాం.

9. గీతాప్రసాద్‌ – హుబ్లి

ప్రశ్న: టిటిడి చరిత్ర, సనాతన ధర్మం తదితర అంశాలపై పిల్లలను ఆకట్టుకునేలా పుస్తకాలు ముద్రించండి?

ఈవో : పిల్లలకు సనాతన ధర్మంపై అవగాహన పెంచేందుకు పుస్తకాలను ముద్రిస్తాం. ఇలాంటి పుస్తకాల ముద్రణపై సమావేశం నిర్వహించి పండితుల అభిప్రాయాలు సేకరిస్తాం. భక్తుల సలహాలను ఆహ్వానిస్తున్నాం. పిల్లలను ఆకట్టుకునేలా సనాతన ధర్మంపై ఎస్వీబీసీలో యానిమేషన్‌ కార్యక్రమాలను మరిన్ని రూపొందిస్తాం.

10. పవన్‌ – నరసాపురం

ప్రశ్న: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద చిరువ్యాపారులు వస్తువులు కొనుగోలు చేయాలంటూ భక్తులను ఇబ్బంది పెడుతున్నారు?

ఈవో : యాత్రికుల వసతి సముదాయం నిర్మాణం పూర్తి కాగానే దుకాణాలను అక్కడికి తరలిస్తాం. భద్రతా సిబ్బంది సంఖ్యను పెంచుతాం.

11. భావనారాయణ – గుంటూరు

ప్రశ్న: సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులు దర్శనానికి వెళ్లేందుకు ఎక్కువ దూరం నడవాల్సి వస్తోంది. లక్కీడిప్‌నకు సంబంధించిన సమాచారాన్ని కంపార్ట్‌మెంట్లలో ఉన్న భక్తులు తెలుసుకునేలా ప్రదర్శించండి. తోమాల సేవ సమయంలో భక్తులను దర్శనానికి అనుమతించడం వల్ల అర్చకుల మంత్రాలు వినిపించలేదు?

ఈవో : ఈ విషయాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాం.

12. నారాయణ – గుంటూరు

ప్రశ్న: టిటిడిలో అన్యమతస్తులపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, తిరుచానూరులో అన్యమత ప్రచారం జరుగుతోంది?

ఈవో : టిటిడిలో 44 మంది అన్యమత ఉద్యోగులను గుర్తించాం. ఈ విషయం కోర్టులో ఉంది. కోర్టు ఆదేశాలను పాటిస్తాం. తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ పరిధిలో ఎలాంటి అన్యమత ప్రచారం జరగడం లేదు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.