ASTADALA PADA PADMARADHANA SEVA TO CONTINUE _ అష్ట‌ద‌ళ‌పాద‌ప‌ద్మారాధ‌న‌ సేవ కొనసాగింపు

TIRUPPAVADA TICKET HOLDERS TO BEGET BREAK DARSHAN

 

Tirumala, 16 May 2022: TTD has decided to continue the Astadala Pada Padmaradhana seva slated for every Tuesday in view of advance online bookings by devotees till June this year.

 

Earlier TTD had announced cancellation of the seva in view of summer rush of devotees but has now continued the seva that the advance bookings last till June.

 

Similarly TTD has decided to offer break darshan tickets for those who purchased online Tiruppavada seva tickets till June 30 or to accept refunds as the Seva has also been suspended. 

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

అష్ట‌ద‌ళ‌పాద‌ప‌ద్మారాధ‌న‌ సేవ కొనసాగింపు

తిరుప్పావడ సేవా టికెట్లు గలవారికి బ్రేక్ దర్శనం

తిరుమల, 2022 మే 16: వేస‌విలో భ‌క్తుల ర‌ద్దీని దృష్టిలో ఉంచుకుని వారి సౌక‌ర్యార్థం జూన్ 30వ తేదీ వ‌ర‌కు అష్ట‌ద‌ళ‌పాద‌ప‌ద్మారాధ‌న‌, తిరుప్పావ‌డ సేవ‌ల‌ను తాత్కాలికంగా ర‌ద్దు చేస్తున్నట్టు టిటిడి ప్రకటించిన విషయం తెలిసిందే.

అయితే, ప్రతి మంగళవారం నిర్వహించే అష్ట‌ద‌ళ‌పాద‌ప‌ద్మారాధ‌న‌ సేవాటికెట్లను జూన్ వరకు ఆన్లైన్ లో విడుదల చేయడంతో భక్తులు బుక్ చేసుకున్నారు. కావున ఆన్లైన్ లో సేవాటికెట్లు బుక్ చేసుకున్న వారిని అష్ట‌ద‌ళ‌పాద‌ప‌ద్మారాధ‌న‌ సేవకు అనుమతించాలని టిటిడి నిర్ణయించింది.


అదేవిధంగా, అడ్వాన్స్ బుకింగ్ లో జూన్ 30వ తేదీ వరకు తిరుప్పావడ సేవా టికెట్లు గలవారు ఆయా తేదీల్లో బ్రేక్ దర్శనానికి రావాలని కోరింది. లేనిపక్షంలో సేవాటికెట్ రీఫండ్ పొందాలని కోరడమైనది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారి చే విడుదల చేయబడినది.