QUALITY MEDICARE TO DEVOTEES DURING ANNUAL FETE-SMO_ బ్ర‌హ్మోత్స‌వాల‌కు విచ్చేసే భ‌క్తుల‌కు మెరుగైన వైద్య‌సేవ‌లు :అశ్విని ఆసుప‌త్రి మెడిక‌ల్ సూప‌రింటెండెంట్ డా.. న‌ర్మ‌ద‌

Tirumala, 14 September 2018: The TTD Medical Wing is fully geared to provide quality medical assistance to devotees who throng the annual Brahmotavams said, Dr Narmada, Medical Superintendent Aswini Hospital, Tirumala.

Addressing the media persons at the Media centre set up by the TTD PR department in the Rambagicha Rest House-2, Dr Narmada said all infrastructure available at the SVIMS, BIRRDS, RUIA and Aswini hospital have been roped in for providing extended medical facilities to the devotees and special arrangements have been made for Garuda Seva.

Senior doctors with battery driven cars, carrying emergency medicine for trauma and injuries will be stationed on the Mada streets, Vaikuntham Queue Complex-1 and 2, Gali gopuram, ATC and Kalyanakatta regions and in all the dispensaries are also functional besides the Aswini hospital.

11 first aid centres were set up with locations at PAC-2, Ram Bhageecha -2, 7th mile on foot path ofAlipiri, Papa Vinasam, Vengamamba Anna prasada Bhavan, Bashyakarla Sannidi, Srivari Temple inside, Narayanagiri Gardens, 1500 step on Alipiri foot path and Srivari Mettu foot path. In all 4 doctors, 80 members para medial staff totalling 125 persons were deployed for serving the devotees on Garuda seva day.

Besides general medicine, orthopaedics, surgery, emergency medicine will also be taken care of, she said.

Dr Narmada said in all 13 ambulances including 7 of them are 108 Ambulance services. 4 will be stationed at four mada streets, one each at Narayanagiri Gardens, Srivari Mettu and Alipiri. The Apollo Emergency cardiac centre at the Ashwini hospital is fully geared for truma and stroke cases and other emergency services at the Ashwini Hospital in Tirumala.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs.TIRUPATI

బ్ర‌హ్మోత్స‌వాల‌కు విచ్చేసే భ‌క్తుల‌కు మెరుగైన వైద్య‌సేవ‌లు :అశ్విని ఆసుప‌త్రి మెడిక‌ల్ సూప‌రింటెండెంట్ డా.. న‌ర్మ‌ద‌

సెప్టెంబరు 14, తిరుమల 2018: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు అవ‌స‌ర‌మైన ప‌క్షంలో మెరుగైన వైద్యసేవలు అందించేందుకు టిటిడి వైద్యవిభాగం ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేప‌ట్టామ‌ని అశ్విని ఆసుప‌త్రి మెడిక‌ల్ సూప‌రింటెండెంట్ డా. న‌ర్మ‌ద తెలిపారు. తిరుమ‌ల‌లోని రాంభ‌గీచా-2లో గ‌ల మీడియా సెంట‌ర్‌లో శుక్ర‌వారం మీడియా స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా డా.. న‌ర్మ‌ద మాట్లాడుతూ బ్ర‌హ్మోత్స‌వాల్లో గ‌రుడ‌సేవ‌నాడు అత్య‌వ‌స‌ర వైద్య‌సేవ‌లు అందించేందుకు తిరుమలలోని అశ్విని ఆసుపత్రి, తిరుపతిలోని స్విమ్స్‌, బర్డ్‌, రుయా, టిటిడి కేంద్రీయ వైద్యశాలల్లో అత్య‌వ‌స‌ర విభాగాల‌ను ఏర్పాటుచేసిన‌ట్టు తెలిపారు. భ‌క్తు ర‌ద్దీ దృష్ట్యా మాడ వీధుల నాలుగు మూల‌ల్లో సీనియ‌ర్ డాక్ట‌ర్లతోపాటు మందుల‌తో బ్యాట‌రీ వాహ‌నం అందుబాటులో ఉంటుంద‌న్నారు. తిరుమలలో అశ్విని ఆసుప‌త్రితోపాటు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-1, 2, గాలిగోపురం, ఎటిసి, క‌ల్యాణ‌క‌ట్ట ప్రాంతాల్లో, ఉద్యోగులకు క‌లిపి 6 డిస్పెన్స‌రీలు ఉన్నాయ‌ని వివ‌రించారు. పిఏసి-2, రాంభగీచా విశ్రాంతి గృహం, కాలిబాట మార్గంలోని ఏడో మైలు, పాపవినాశనం, వెంగ‌మాంబ అన్న‌ప్ర‌సాద భ‌వ‌నం, భాష్య‌కార్ల స‌న్నిధి, శ్రీ‌వారి ఆల‌యంలోప‌ల, నారాయ‌ణ‌గిరి ఉద్యాన‌వ‌నాలు, అలిపిరి, అలిపిరి మార్గంలో 1500వ‌ మెట్టు, శ్రీ‌వారి మెట్టు వ‌ద్ద క‌లిపి 11 ప్ర‌థ‌మ చికిత్స కేంద్రాలు ఉన్నాయ‌న్నారు. మొత్తం 45 మంది డాక్ట‌ర్లు, 80 మంది పారామెడిక‌ల్ సిబ్బంది కలిపి మొత్తం 125 మంది అందుబాటులో ఉన్న‌ట్టు వెల్ల‌డించారు. సాధారణ చికిత్సతోపాటు కార్డియాలజి, ఆర్థోపెడిక్స్‌, జనరల్‌ సర్జరీ మెడిసిన్‌, ఎమర్జన్సీ మెడిసిన్‌ విభాగాల వైద్యులు కూడా ఉన్నార‌ని తెలిపారు.

మొత్తం 13 అంబులెన్సులు ఉన్నాయ‌ని, ఇందులో 108 అంబులెన్సులు 7 ఉన్నాయ‌ని తెలిపారు. వాహ‌నం ఊరేగింపు వెన‌క 1, నాలుగు మాడ వీధుల్లో 4 అంబులెన్సులు ఉంటాయ‌ని, నారాయ‌ణ‌గిరి ఉద్యాన‌వ‌నాలు, శ్రీ‌వారి మెట్టు వ‌ద్ద మొబైల్ అంబులెన్సు ఉంటుంద‌ని వివ‌రించారు. తిరుమలలోని అశ్విని ఆసుపత్రిలో అపోలో ఎమర్జన్సీ కార్డియాక్‌ సెంటర్‌ అందుబాటులో ఉందని, ఇక్కడ గుండెపోటుకు గురైన వారికి, ఇతరులకు అత్యవసర వైద్యసేవలు అందిస్తారని తెలియ‌జేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి స‌హాయ ప్ర‌జాసంబంధాల అధికారి కుమారి పి.నీలిమ పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.