ATTRACTIVE CULTURAL SHOWS AT SRIVARI BRAHMOTSAVAM TO ALLURE DEVOTEES _ శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల్లో భ‌క్తుల‌కు క‌నువిందుగా కళారూపాల ప్రదర్శన

  • 88 TEAMS FROM 7 STATES AND PUDUCHERRY
  •  FOLK & PURANIC EPISODES TO BE HIGHLITHS

 Tirumala, 15 September 2022: TTD is fully geared to showcase spectacular display of folk and puranic episodes as part of cultural programs accompanying the vahana sevas during the ensuing annual Srivari Brahmotsavams.

TTD has roped in eminent pundits to give erudite commentaries during vahana sevas and 88 cultural teams from seven states and Puducherry during the nine-day celestial festivities.

All arrangements, rehearsals and preparations are completed to provide Dharmic, Bhakti Sangeet and religious discourses by coordinated efforts of HDPP, Annamacharya, Dasa Sahitya, Alwar Divya Prabandam projects of TTD and Sri Venkateswara college of Music and Dance.

Besides artists from southern states of AP, Telangana, Karnataka, Tamilnadu, Kerala, performers from Maharashtra, Odisha and Puducherry are also presenting folk arts and dances during Brahmotsavams.

Among the 88teams, 50 from HDPP, 24 of Dasa Sahitya project, 14 from Annamacharya project will display their talent and skills in folk dances and puranic lores during the vahana sevas.

In all 63 teams from AP will showcase: Galagala Bhajans, Chakka bhajan, Pillanagovi bhajans, Tappata gullu, Lambadi dance, Kolatas, keelugurralu, dappulu.

The two teams from Telangana will present chakka bhajan and Kolatas.The women teams from Tamilnadu and Puducherry will present Karakattam, Pampai Bayalattam, Poyakal kuttire, Mayalata, Kaliyattam, and Kolatas.

The 12 teams from Karnataka plans to present various dance forms like

Dollu Kunita, Puja kunita, Somana Kunita Kamasala, Tamate forms.

While Maharashtra teams are geared to present Dindi Bhajan, Drums while teams from Odisha, Kerala will showcase their local art forms.

BHAKTI SANGEET AND CULTURAL PROGRAMS

TTD has fine tuned activities to be presented at various platforms like Nada Neeranjanam and Asthana Mandapam at Tirumala, Mahati auditorium, Annamacharya Kala Mandiram and Ramachandra Pushkarini in Tirupati.

Daily Bhakti sangeet and cultural programs at Tirumala/Tirupati

TIRUMALA

At Nada Neeranjanam platform, everyday there will be Mangala Dhwani in mornings and Vishnu Sahasranama parayanams, Harikathas, Bhakti sangeet and Annamaiah vinnapalu at Asthana Mandapam.

TIRUPATI

At mahati auditorium Bhakti Sangeet and cultural programs are conducted in evenings. At Annamacharya Kala mandiram, Bhakti sangeet and instrumental music are being arranged and at Ramachandra Pushkarini Bhakti sangeet and Dance programs are organised daily at night.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల్లో భ‌క్తుల‌కు క‌నువిందుగా కళారూపాల ప్రదర్శన

– పాండిచ్చేరితోపాటు 7 రాష్ట్రాల నుండి క‌ళాకారులు రాక‌

– మొత్తం 88 క‌ళాబృందాలు

– జాన‌ప‌ద క‌ళారూపాల‌కు పెద్ద‌పీట‌

తిరుమల, 2022 సెప్టెంబ‌రు 15: శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవ వాహనసేవల్లో అపురూప‌మైన కళారూపాల ప్రదర్శనకు టిటిడి ఏర్పాట్లు చేప‌ట్టింది. టిటిడి ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వ‌ర్యంలో ఈ క‌ళారూపాలు భ‌క్తుల‌కు క‌నువిందు చేయ‌నున్నాయి. ఉత్తరాదితో పాటు దక్షిణాదికి చెందిన 7 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం నుండి కళాకారులు వాహ‌న‌సేవ‌ల్లో పాల్గొన‌నున్నారు. వాహ‌న‌సేవ‌ల స‌మ‌యంలో విశిష్ట‌త‌ను తెలియ‌జేసేందుకు ప్ర‌ముఖ పండితులు వ్యాఖ్యానం చేస్తారు.

టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టు, ఆళ్వార్ దివ్య‌ప్ర‌బంధ ప్రాజెక్టు, శ్రీవేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాల్లో ఆధ్యాత్మిక, ధార్మిక, భక్తి సంగీత కార్యక్రమాల నిర్వ‌హ‌ణకు ఏర్పాట్లు పూర్త‌య్యాయి. దక్షిణాదిలోని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరితో పాటు ఉత్తరాదికి చెందిన మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల నుంచి వివిధ కళారూపాలు ప్రదర్శించేందుకు కళాకారులు విచ్చేయ‌నున్నారు. ఆయా రాష్ట్రాల క‌ళాకారులు స్థానిక జాన‌ప‌ద క‌ళారూపాల‌ను ప్ర‌ద‌ర్శిస్తారు.

వాహ‌న సేవ‌ల్లో హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ నుండి 50, దాస సాహిత్య ప్రాజెక్టు నుండి 24, అన్న‌మాచార్య ప్రాజెక్టు నుండి 14 క‌లిపి మొత్తం 88 క‌ళాబృందాలు పాల్గొన‌నున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుండి 63 బృందాల్లో క‌ళాకారులు పాల్గొంటారు. వీరు గరగల భజన, చెక్క భజన, పిల్లన గ్రోవి భజన, తప్పెట గుళ్లు, లంబాడీ నృత్యం, కోలాటం, కీలుగుర్రాలు, బళ్లారి డప్పులు క‌ళారూపాల‌ను ప్ర‌ద‌ర్శిస్తారు. తెలంగాణ నుండి రెండు బృందాలు చెక్క భజన, కోలాటం ప్ర‌ద‌ర్శిస్తాయి. క‌ర్ణాట‌క నుండి ఐదు బృందాలు విచ్చేసి మహిళా తమటే, డొల్లుకునిత‌, పూజకునిత, సోమనకునిత, క‌మ‌స‌ల‌ కళారూపాల‌ను ప్ర‌ద‌ర్శిస్తారు.

త‌మిళ‌నాడు నుండి 12 బృందాలు రానున్నాయి. వీరు కరకట్టం, పంపై, ఒయిలాట్టం, పోయికల్ కుత్తిరై, మాయిలాటం, కాళియాట్టం, కోలాటం ప్ర‌ద‌ర్శిస్తారు. మహారాష్ట్ర నుండి రెండు బృందాలు డిండి భజన, డ్రమ్స్ వాయిద్యం, ఒడిశా నుండి ఒక‌ బృందం, కేరళ నుండి ఒక‌ బృందం, పాండిచ్చేరి నుండి రెండు బృందాలు స్థానిక క‌ళారూపాల‌ను ప్ర‌ద‌ర్శించ‌నున్నారు.

భ‌క్తి సంగీతం, సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు

తిరుమల నాదనీరాజనం వేదికపై ఉద‌యం 4.30 నుండి 5.30 గంట‌ల వ‌ర‌కు మంగ‌ళ‌ధ్వ‌ని, ఆస్థానమండపంలో ఉదయం 10 నుంచి రాత్రి 8.30 గంటల వరకు విష్ణుస‌హ‌స్ర‌నామ పారాయ‌ణం, భక్తి సంగీతం, అన్న‌మ‌య్య విన్న‌పాలు, హ‌రిక‌థ పారాయ‌ణం నిర్వ‌హిస్తారు. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వ‌ర‌కు భ‌క్తి సంగీతం, సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు, అన్నమాచార్య కళామందిరంలో సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వ‌ర‌కు భ‌క్తి సంగీతం, వాయిద్య సంగీతం, రామ‌చంద్ర పుష్క‌రిణి వ‌ద్ద సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వ‌ర‌కు భ‌క్తి సంగీతం, నృత్య కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.