BTU OF TUMMURU SRI K & N TEMPLE FEB 18-24 _ ఫిబ్ర‌వ‌రి 18 నుంచి 24వ తేదీ వరకు తుమ్మూరులోని

Tirupati, 8, February, 2020: TTD is organising the annual Brahmotsavams of Sri Kamakshi sameta Sri Nilakantheswara temple at Tummuru in Naidupeta mandal of Potti Sriramulu Nellore District from February 18-24 with Ankurarpanam on the evening of February 18.

The cultural teams of HDPP and Annamacharya Project will perform harikatha, Kolatas, Bhakti sangeet before vahana sevas every day.

Dwajarohanam on February 19, Chappara utsavam in morning session during all days, Kalyanotsavam on 22, and Dwajavarohanam on 23.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI  

 

ఫిబ్ర‌వ‌రి 18 నుంచి 24వ తేదీ వరకు తుమ్మూరులోని
 
శ్రీ కామాక్షీ సమేత శ్రీ నీలకంఠేశ్వరస్వామివారి ఆలయ బ్రహ్మోత్సవాలు
 
తిరుపతి, 2020 ఫిబ్రవరి 08: టిటిడికి అనుబంధంగా ఉన్న శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం తుమ్మూరులోని శ్రీ కామాక్షీ సమేత శ్రీ నీలకంఠేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్ర‌వ‌రి 18 నుంచి 24వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఫిబ్ర‌వ‌రి 18వ తేదీన సాయంత్రం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగనుంది.
 
బ్రహ్మోత్సవాలకు ఆలయంలో విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రతిరోజూ వాహనసేవల ముందు కళాబృందాలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రతిరోజూ ఉదయం 8 నుండి 9 గంటల వరకు, తిరిగి రాత్రి 8 నుండి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి.
 
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు : 
 
తేదీ    ఉదయం      సాయంత్రం
 
19-02-2020(బుధ‌వారం)       ధ్వజారోహణం    శేష వాహనం
 
20-02-2020(గురువారం)       చప్పర ఉత్సవం     రావణ వాహనం
 
21-02-2020(శుక్ర‌వారం)      చప్పర ఉత్సవం         నంది, హంసవాహనం
 
22-02-2020(శ‌నివారం)      చప్పర ఉత్సవం      మోహినీ అవ‌తారం, గజ, సింహవాహనం, కల్యాణోత్సవం                                                                
 
23-02-2020(ఆదివారం)      చప్పర ఉత్సవం       ధ్వజావరోహణం
 
24-02-2020(సోమ‌వారం) ——-     ఏకాంతసేవ.
 
ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలు, హరికథ, సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
 
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.