KAT AT SRI KAPILESWARA SWAMY TEMPLE ON FEB 12 _ ఫిబ్రవరి 12న శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Tirupati, 8 Feb. 20: Ahead of annual brahmotsavams of Sri Kapileswara swamy temple from February 14-23, TTD plans to conduct the sublime ritual of  Koil Alwar Thirumanjanam on February 12.

As a result after morning rituals the TTD will commence the cleansing exercise from 11.30 am till 2.30 pm in afternoon after Darshan hours from 8.00-11.00 hours in morning and again darshan will recommence after 2.30 pm.

Following are details of Brahmotsavams vahana sevas:

14-02-2020 (Friday) Dwajarohanam (kumbha lagnam) and Hamsa vahanam

15-02-2020 (Saturday) Surya Prabha and Chandra Prabha vahanam 

16-02-2020 (Sunday) Bhoota and Simha Vahanam 

17-02-2020 (Monday) Makara and Sesha Vahanam 

18-02-2020 (Tuesday) Tiruchi and Adhikara Nandi vahanam 

19-02-2020 (Wednesday) Vyaghra and Gaja vahanam 

20-02-2020 (Thursday) Kalpavruksha and Aswa Vahanam 

21-02-2020 (Friday) Rathotsavam (Bhogi theru) and Nandi vahanam 

22-02-2020 (Saturday) Purusha Mruga vahanam and Kalyanotsavam, Tiruchi. Utsavam 

23-02-2020 (Sunday) Surya Prabha vahanam of Sri Nataraja, Trishula snanam, Ravanasura vahanam and final Dwajavarohanam.

The artists of HDPP, Annamacharya Project will render daily harikatha, Bhakti sangeet and other religious programs on all days of Brahmotsavams.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI  

ఫిబ్రవరి 12న  శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

 తిరుపతి, 2020 ఫిబ్రవరి 08: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 12వ తేదీ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఆలయంలో ఫిబ్రవరి 14 నుండి 23వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్న విషయం విదితమే.

ఈ సందర్భంగా ఫిబ్ర‌వ‌రి 12న తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి అభిషేకం, అలంకారము, శుద్ధి నిర్వహిస్తారు. ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం 2.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగనుంది. ఉదయం 8.00 నుండి 11.00 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుండి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ                                                       ఉదయం                        సాయంత్రం

14-02-2020(శుక్ర‌వారం)        ధ్వజారోహణం(కుంభలగ్నం)    హంస వాహనం

15-02-2020(శ‌నివారం)          సూర్యప్రభ వాహనం                    చంద్రప్రభ వాహనం

16-02-2020(ఆదివారం)          భూత వాహనం                           సింహ వాహనం

17-02-2020(సోమ‌వారం)        మకర వాహనం                          శేష వాహనం

18-02-2020(మంగ‌ళ‌వారం)       తిరుచ్చి ఉత్సవం               అధికారనంది వాహనం

19-02-2020(బుధ‌వారం)         వ్యాఘ్ర వాహనం                     గజ వాహనం

20-02-2020(గురువారం)         కల్పవృక్ష వాహనం             అశ్వవాహనం

21-02-2020(శుక్ర‌వారం)          రథోత్సవం(భోగితేరు)           నందివాహనం

22-02-2020(శ‌నివారం)       పురుషామృగవాహనం               కల్యాణోత్సవం, తిరుచ్చి ఉత్సవం  

23-02-2020(ఆదివారం)     శ్రీనటరాజస్వామివారి సూర్యప్రభ వాహనం, త్రిశులస్నానం.                       రావణాసురవాహనం, ధ్వజావరోహణం.

ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ హరికథలు, సంగీత కచేరీలు ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.