24 X 7 TONSURING ACTIVITY ENSURED FOR PILGRIMS – KKC CHIEF _ 2 ల‌క్ష‌ల మంది భ‌క్తులు త‌ల‌నీలాల స‌మ‌ర్ప‌ణ : క‌ల్యాణ‌క‌ట్ట డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న

Tirumala 5 Oct. 19: To avoid waiting for pilgrims thronging Tirumala, the tonsuring activity is ensured round the clock during brahmotsavams at Tirumala,  said Kalyana Katta Deputy EO Smt Nagarathna. 

Briefing on the department activity at Media Centre on Saturday,  KKC DyEO stated that there are 1046 male and 274 female barbers are rendering services at Tirumala in shifts. 

Of the total 1320 barbers, it includes 185 Regular, 250 Piece Rate and 885 Kalynakatta Srivari Sevakulu.  She said with the assurance of Additional EO Sri AV Dharma Reddy,  the women barbers are presented two sets of uniforms on donation basis. “Soon all the 1320 barbers will be given two sets of uniforms by donors from Chennai”,  she maintained. 

AEO Sri Jagannadhachari was also present. 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

2019 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

2 ల‌క్ష‌ల మంది భ‌క్తులు త‌ల‌నీలాల స‌మ‌ర్ప‌ణ :  క‌ల్యాణ‌క‌ట్ట డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న

 అక్టోబరు 05, తిరుమ‌ల‌, 2019: శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల్లో శుక్ర‌వారం వ‌ర‌కు 2 ల‌క్ష‌ల మందికిపైగా భ‌క్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించార‌ని కల్యాణకట్ట డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న తెలిపారు. కల్యాణకట్టల్లో  క్షుర‌కులు క్ర‌మ‌శిక్ష‌ణ‌తో భక్తులకు సత్వర సేవలు అందిస్తున్నార‌ని వివ‌రించారు. తిరుమలలోని రాంభగీచా – 2లో గ‌ల మీడియా సెంటర్‌లో శ‌నివారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో కల్యాణకట్ట సిబ్బంది సేవలను వివరించారు.

బ్రహ్మోత్సవాల్లో 185 మంది రెగ్యుల‌ర్‌, 250 మంది పీస్‌రేట్‌, 885 మంది క‌ల్యాణ‌క‌ట్ట క్షురకులు 24 గంటలపాటు భ‌క్తుల‌కు సేవ‌లందిస్తున్నార‌ని తెలిపారు. ప్రత్యేకంగా మహిళా క్షురకులు 274 మంది ఉన్నార‌ని, వీరు మహిళలకు, చిన్న పిల్లలకు తలనీలాలు తీస్తున్నార‌ని వివ‌రించారు. దీని వల్ల భక్తులు వేచి వుండే సమయం తగ్గి త్వరగా తలనీలాలు సమర్పించుకుంటున్నార‌ని తెలియజేశారు. టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి ఆధ్వ‌ర్యంలో ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి మాజీ స‌భ్యుడు శ్రీ క‌న్న‌య్య మ‌హిళా క్షుర‌కుల‌కు రెండు జ‌త‌ల యూనిఫారాలు అందించార‌ని, త్వ‌ర‌లో పురుషుల‌కు కూడా అందిస్తామ‌ని చెప్పారు. క‌ల్యాణ‌క‌ట్ట క్షుర‌కుల‌కు త‌ర‌చూ అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నామ‌ని, దీనివ‌ల్ల భ‌క్తుల నుండి ఫిర్యాదులు త‌గ్గాయ‌ని తెలిపారు.

 ఈ మీడియా స‌మావేశంలో టిటిడి పిఆర్వో డా.టి.ర‌వి, ఎపిఆర్వో కుమారి పి.నీలిమ పాల్గొన్నారు.

టిటిడి  ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.