ADDNL. EO CONGRATULATES ALL _ సమిష్టి కృషితో గరుడసేవ విజయవంతం : టిటిడి తిరుమల అదనపు ఈవో శ్రీ ఏవీ ధర్మారెడ్డి

Tirumala, 5 Oct. 19: While congratulating all the departments over the stupendous success of Garuda Seva,  the Additional EO Sri AV Dharma Reddy thanked the pilgrims for their patience and devotion even during the inclement weather conditions. 

Addressing the senior officers at the TTD Control Room in Tirumala on Saturday,  the Ad. EO said all the officers have but their extraordinary efforts with their staff members on Garuda Seva day and achieved incident free success inspite of five lakh turn out. 

Adding further,  he specially thanked and complimented all the vahanam bearers who carried off the Garuda Vahanam without giving scope to any culpability even though it has rained heavily. 

He expressed his surprise over the commitment of devotees sitting in galleries,  who did not move an inch inspite of a continuous heavy downpour. And finally, he thanked all the Srivari Sevakulu for their selfless services to pilgrims in distributing Annaprasadam and water in galleries. 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

సమిష్టి కృషితో గరుడసేవ విజయవంతం  : టిటిడి తిరుమల అదనపు ఈవో శ్రీ ఏవీ ధర్మారెడ్డి

తిరుమల, 05 అక్టోబర్, 2018: ప్రశాంతంగా భక్తులకు దర్శనభాగ్యం కల్పించి శ్రీవారి గరుడ వాహనసేవ విజయవంతమ‌య్యేందుకు సమిష్టిగా కృషి చేసిన టిటిడి అధికారులు, సిబ్బంది, పోలీసులు, డెప్యుటేషన్‌ సిబ్బందికి టిటిడి తిరుమల అదనపు ఈవో శ్రీ ఏవీ ధర్మారెడ్డి అభినందనలు తెలియజేశారు. తిరుమలలోని రాంభగీచా విశ్రాంతి గృహం ఎదురుగా గల కంట్రోల్‌ సెంటర్‌లో శనివారం ఉదయం అధికారులతో  అదనపు ఈవో సమావేశం నిర్వహించారు.

గ్యాలరీల్లోని భక్తులకు నాణ్యమైన అన్నప్రసాదాలు, మంచినీరు, మ‌జ్జిగ‌ అందించిన అన్న‌ప్ర‌సాదం, ఆరోగ్య విభాగాల సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. శ్రీవారి సేవకులు, స్కౌట్స్ అండ్ గైడ్స్‌ భక్తులకు విశేషసేవలు అందించారని కొనియాడారు. వాహనసేవను దర్శించుకున్న అనంతరం భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా నిర్దేశిత మార్గాల ద్వారా వెలుపలికి వెళ్లేందుకు టిటిడి ఇంజినీరింగ్‌, భద్రతా సిబ్బంది, పోలీసులు సమన్వయంతో వ్యవహరించారని తెలిపారు. వర్షంలోనూ భక్తి భావంతో వాహనాన్ని మోసిన వాహన బేరర్స్ ను ప్రత్యేకంగా అభినందించారు. భక్తులు సంయమనంతో గ్యాలరీలో వేచియుండి గరుడ వాహనాన్ని దర్శించుకున్నారని తెలిపారు.

ఈ సమావేశంలో టిటిడి సీనియర్  అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 

t content