AVOID AD BREAKS IN SVBC PROGRAMS-CALLERS_

Tirumala, 3 August 2018: While appreciating the devotional programs that are being telecasted in TTD’s Sri Venkateswara Bhakti Channel (SVBC) as par excellence, the pilgrims requested EO Sri Anil Kumar Singhal to see that there are ad break interruptions.

Dial Your EO program was held at Annamaiah Bhavan in Tirumala on Friday. TTD EO attended to the calls of 20 pilgrim callers from across the country.

A pilgrim caller Sri Subrahmanyam from Visakhapatnam sought the EO to ensure no advertisements in between live programs or interesting devotional programs. Responding to the caller, the EO said the suggestion is well taken and he already discussed with CEO SVBC on the issue.

Another caller Sri Shanmuga Sundaram from Erode of Tamil Nadu sought EO to reintroduce Tamil commentary during live telecast of Kalyanotsavam for which the EO answered it is now available on SVBC 2.

When Sri Srinivas from Bengaluru, Sri Raju from Telengana, Smt Devi from Vijayanagaram and Sri Ramakrishna from Visakhapatnam sought EO to have separate darshan lines for aged and differently able pilgrims the EO said, that there is need for change in the mind set of the pilgrims also. The aged and specially able should chose to come on normal days which have comparatively less rush. Though we have identified such days in a year and providing darshan to this category of pilgrims, they are not utilizing the privilege and preferring darshan during peak season only”, he observed.

Smt Kanaka Durga from Khammam brought to the notice of EO that the Vada prasadam issued to them during Kalyanotsava Seva last month was spoiled. EO said that necessary action will be initiated to see that it will not be repeated.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

‘డయల్‌ యువర్‌ ఈవో’లో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

ఆగస్టు 03, తిరుమల 2018: తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం జరిగింది. ఇందులో పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలకు ఈవో సమాధానాలు ఇచ్చారు.

1. దేవి – విజయనగరం.

ప్రశ్న: వృద్ధులు, దివ్యాంగుల క్యూలైన్‌లో తోపులాట జరుగుతోంది. వీరికి వేరువేరుగా దర్శనం కల్పించండి?

ఈవో : తోపులాట జరగకుండా అవగాహన కల్పిస్తాం. రోజుకు 1400 మందికి వృద్ధులు, దివ్యాంగులకు శ్రీవారి దర్శనం కల్పిస్తున్నాం. నెలలో 2 సాధారణ రోజుల్లో 4 వేల టోకెన్లు అదనంగా జారీ చేస్తున్నాం. వీటిని సద్వినియోగం చేసుకోండి.

2. వినోద్‌ – హైదరాబాద్‌.

ప్రశ్న: కల్యాణకట్ట సిబ్బంది డబ్బులు అడుగుతున్నారు?

ఈవో : ఇటీవల పలువురు కల్యాణకట్ట సిబ్బందిపై చర్యలు తీసుకున్నాం. వారి విజ్ఞప్తి మేరకు తిరిగి విధుల్లోకి తీసుకున్నాం. ఇకపై డబ్బులు అడగకుండా విజిలెన్స్‌ అధికారులను అప్రమత్తం చేస్తాం.

3. షణ్ముగ సుందరం – ఈరోడ్‌, సుబ్రమణ్యం – విశాఖ

ప్రశ్న: ఎస్వీబీసీలో కల్యాణోత్సవ విశిష్టతను తమిళంలో తెలియజేయండి, కార్యక్రమాల మధ్యలో యాడ్స్‌ తగ్గించండి?

ఈవో : ఎస్వీబీసీ-2లో తమిళంలో ప్రసారాలు జరుగుతున్నాయి. యాడ్స్‌ తగ్గిస్తాం.

4. శ్రీనివాస్‌ – బెంగుళూరు, రాజు – తెలంగాణ., ప్రదీప్‌ -హైదరాబాద్‌

ప్రశ్న: నడచివచ్చినా శ్రీవారి దర్శనం చాలా ఆలస్యం అవుతోంది?

ఈవో : దివ్యదర్శనం టోకెన్లు దొరకని పక్షంలో సర్వదర్శనం టోకెన్లు పొందండి. ఖాళీ సమయంలో తిరుమల, తిరుపతిలోని సందర్శనీయ స్థలాలను దర్శించండి. నిర్దేశిత సమయంలో క్యూలైన్లోకి ప్రవేశించి సులభతరంగా స్వామివారిని దర్శించుకోండి.

5. మనోహర్‌ – తిరుపతి

ప్రశ్న: తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన సేవను తిరిగి ప్రవేశపెట్టండి?

ఈవో : కుంకుమార్చన సేవను టిటిడి రద్దు చేయలేదు. మధ్యాహ్నం 1 గంట నుండి 4.30ల మధ్యలో నిర్వహిస్తాం. సామాన్యభక్తుల సౌకర్యార్థం నిర్దిష్ట సమయంలో మాత్రమే బ్రేక్‌ దర్శనం అమలు చేస్తున్నాం.

6. సుబ్బారావు – కాకినాడ

ప్రశ్న: దివ్యదర్శనం భక్తులకు నడకదారిలో గదుల బుకింగ్‌ వసతి కల్పించండి?

ఈవో : తిరుమలలో వసతి గదులు పరిమితంగా ఉన్నాయి. కరెంట్‌ బుకింగ్‌లో రోజుకు 2800 నుండి 3200 వరకు గదులు అందుబాటులో ఉంటాయి.

7. భరత్‌ – గుంటూరు

ప్రశ్న: గుంటూరు సమాచారకేంద్రంలో నెట్‌ కనెక్టవిటీతో పాటు వసతులు కల్పించండి?

ఈవో : తప్పకుండా కల్పిస్తాం.

8. భావనారాయణ – గుంటూరు

ప్రశ్న: సర్వదర్శనం టోకెన్లను ఆన్‌లైన్‌లో ప్రవేశపెట్టండి, వసతి గదుల వద్ద దగ్గరగా తలనీలాలు సమర్పించే అవకాశం కల్పించండి?

ఈవో : సర్వదర్శనం టోకెన్లను ఆన్‌లైన్‌ ప్రవేశపెట్టడాన్ని పరిశీలిస్తాం. వసతి గదుల వద్ద భక్తులు తలనీలాలు సమర్పించేందుకు కావాల్సిన సౌకర్యాలపై అధ్యయనం చేస్తాం.

9. కనకదుర్గ – ఖమ్మం

ప్రశ్న: వృద్ధులకు పై అంతస్తులలో వసతి గదులు ఇస్తున్నారు, దీంతో మెట్లు ఎక్కలేకపోతున్నాం, వడ ప్రసాదం బూజు పట్టింది ?

ఈవో : వృద్ధులకు గ్రౌండ్‌ ఫ్లోర్‌లోనే వసతి గదులు కేటాయించాలంటే వేచియుండే సమయం పెరుగుతుంది. ఈ విషయాన్ని పరిశీలిస్తాం. వడ ప్రసాదానికి బూజు పట్టిన అంశంపై విచారణ చేపడుతాం.

10. రామకృష్ణ – విశాఖ

ప్రశ్న: భక్తుల రద్దీ క్రమబద్దీకరణ చాలా బావుంది, ధన్యవాదాలు. అష్టదళపాదపద్మారాధన సేవకు వచ్చాను, భక్తులు పరుగులు తీయకుండా చర్యలు చేపట్టండి?

ఈవో : స్వామివారి ఆర్జిత సేవలు, దర్శనం విషయంలో భక్తులంతా తొందరపడకుండా సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నా.

11. బన్సీలాల్‌ – హైదరాబాద్‌

ప్రశ్న: ఉచిత బస్సులను తిరుమలలో పెంచండి ?

ఈవో : తిరుమలలో ప్రస్తుతం టిటిడి ఉచిత బస్సులు ఉన్నాయి. అదనంగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసి ఉచితంగా రవాణా కల్పిస్తున్నాం.

12. కుశాల్‌ – విజయవాడ

ప్రశ్న: గోగర్భం డ్యాం వద్ద మఠాలలో అధిక ధరలు వసూలు చేస్తున్నారు ?

ఈవో : మఠాలు భక్తుల విషయంలోన సేవా భావంతో వ్యవహరించాల్సి ఉంది.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.