AWARENESS PROGRAMME ON CORONA VIRUS AT SVETA _ గుండె వ్యాధుల‌పై అప్ర‌మ‌త్తంగా ఉండాలి : డాక్ట‌ర్ వ‌న‌జ‌

Tirupati, 30 Sep. 20:The one day on-line interactive awareness programme on Corona Covid 19 Virus in Sri Venkateswara Employees Training Academy (SVETA) building at Tirupati on Wednesday.

Dr Vanaja, Cardiologist, from Sri Venkateswara Institute of Medical Sciences (SVIMS) who attended the awareness programme, extended some important information through power point presentation. 

Later she clarified the doubts raised by employees through online call on Covid and heart related issues. She said, the fear factor will immensely affect the health of patients and that there is a need to overcome it. “Be it corona or any other disease, the patient should not lose courage and should combat the illness by following our traditional practices of Yoga, Pranayama and healthy food habits. All these should be observed by every person to lead a healthy living”, she observed.

SVETA Director Sri Ramanjulu Reddy, AEO Smt Jagadeeshwari were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

గుండె వ్యాధుల‌పై అప్ర‌మ‌త్తంగా ఉండాలి : డాక్ట‌ర్ వ‌న‌జ‌

తిరుప‌తి, 2020 సెప్టెంబరు 30: క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన వారు కొంత‌కాలం పాటు గుండె సంబంధిత వ్యాధుల‌పై అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని తిరుప‌తి స్విమ్స్ ఆసుప‌త్రికి చెందిన గుండె వైద్య నిపుణురాలు డాక్ట‌ర్ వ‌న‌జ సూచించారు. తిరుప‌తిలోని శ్వేత భ‌వ‌నంలో బుధ‌వారం ఉద‌యం 11 ‌నుండి ‌మ‌ధ్యాహ్నం 1 గంట వ‌ర‌కు టిటిడి ఉద్యోగుల‌కు ఆన్‌లైన్ ద్వారా అవ‌గాహ‌న కార్య‌క్ర‌మం నిర్వహించారు.

 ఈ సంద‌ర్భంగా డాక్ట‌ర్ వ‌న‌జ మాట్లాడుతూ క‌రోనా వైర‌స్ ప్ర‌భావం కార‌ణంగా గుండె కండ‌రాలు దెబ్బ‌తిన‌డం, ర‌క్తంలో ఆక్సిజ‌న్ శాతం త‌గ్గి గుండెకు స‌ర‌ఫ‌రాలో ఆటంకాలు ఏర్ప‌డ‌డం, గుండెపోటు లాంటి అనారోగ్య ప‌రిస్థితులు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌న్నారు. అప్ర‌మ‌త్తంగా ఉంటూ ఇలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే వెంట‌నే డాక్ట‌రును సంప్ర‌దించాల‌ని సూచించారు. ఇందుకు ధైర్యంగా ఉండ‌డం చాలా ముఖ్య‌మని, భార‌తీయుల‌కు సంప్ర‌దాయంగా వ‌స్తున్న యోగా, ధ్యానం, ప్రాణాయామం లాంటివి చ‌క్క‌గా ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని వివ‌రించారు. అనంత‌రం ఉద్యోగులు అడిగిన ప‌లు సందేహాల‌కు స‌మాధానాలిచ్చారు. ఈ ఆన్‌లైన్ అవ‌గాహ‌న కార్య‌క్ర‌మంలో వైజాగ్‌, రిషికేష్ నుండి కూడా ప‌లువురు ఉద్యోగులు పాల్గొని త‌మ సందేహాల‌ను నివృత్తి చేసుకున్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో శ్వేత సంచాల‌కులు డా. ఎ.రామాంజుల‌రెడ్డి, ఏఈవో శ్రీ‌మ‌తి జ‌గ‌దీశ్వ‌రి పాల్గొన్నారు.      

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.