Rs.1Cr DONATED TO SVBC _ ఎస్వీబీసీ ట్ర‌స్టుకు రూ. కోటి విరాళం

Tirumala, 30 Sep. 20:Chennai based devotee Smt Kamakshi Shankar has donated Rs.1Crore to SVBC Trust in Tirumala on Wednesday. 
 
She handed over the DD for the same to Additional EO and SVBC MD Sri AV Dharma Reddy in Tirumala temple. 
 
She complimented TTD for the series of Parayanams including Sundarakanda, Veda Parayanam, Bhagavat Gita, Virataparva Parayanams and spreading Hindu Sanatana Dharma in a right way. 
 
Later she had darshan of Lord Venkateswara and also took part in Shodasadina Sundarakanda Parayana Deeksha at Vasanta Mandapam. 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఎస్వీబీసీ ట్ర‌స్టుకు రూ. కోటి విరాళం

తిరుమ‌ల‌, 2020 సెప్టెంబరు 30: శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ట్ర‌స్టుకు బుధ‌వారం ఒక కోటి రూపాయ‌లు విరాళంగా అందింది. చెన్నైకి చెందిన శ్రీ‌మ‌తి కామాక్షి శంక‌ర్ ఈ మేర‌కు విరాళం డిడిని శ్రీ‌వారి ఆల‌యంలో టిటిడి అద‌న‌పు ఈవో, ఎస్వీబీసీ ఎండి శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డికి అంద‌జేశారు.

ధ‌ర్మ‌ప్ర‌చారంలో భాగంగా టిటిడి చేపడుతున్న సుంద‌ర‌కాండ‌, వేద‌పారాయ‌ణం, భ‌గ‌వ‌ద్గీత‌, విరాట‌ప‌ర్వ పారాయ‌ణం చాలా బాగున్నాయ‌ని ఈ సంద‌ర్భంగా దాత అభినందించారు.

అనంత‌రం దాత శ్రీ‌వారి ద‌ర్శ‌నం చేసుకున్నారు. వ‌సంత‌మండ‌పంలో జ‌రుగుతున్న షోడ‌ష‌దిన సుంద‌ర‌కాండ పారాయ‌ణ దీక్ష‌లో పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.