AYUDHA PUJA AT VIGILANCE DEPT _ నిఘా మ‌రియు భ‌ద్ర‌తా విభాగంలో ఆయుధ‌పూజ‌

Tirumala, 30 October 2020: TTD organised Ayudha puja at the Vigilance and security department on Friday.

Additional EO Sri AV Dharma Reddy, CVSO Sri Gopinath Jatti were present.

After performing Vishesha puja to portraits of Sri Venkateswara and Sri Durga they also observed Ayudha puja to weapons and other security equipments. The security personnel explained the functioning of all equipment and weapons to the Additional EO.

Speaking on the occasion the TTD CVSO said the TTD possessed state of the art bomb detection, fire fighting, and communication equipment and 2800 personnel were providing dedicated service in the COVID-19 situation risking their lives to safeguard the invaluable assets of Srivari temple and safety of devotees.

He said Ayudha puja was performed seeking blessings for health of devotees and vigilance staff and to ensure total security inTirumala shrine.

CASH REWARDS TO VIGILANCE PERSONAL

The Additional EO and CVSO distributed cash rewards to 38 security and vigilance staff for their meritorious services

TTD additional CVSO Sri Shivkumar Reddy, VGOs Sri Manohar and Sri Prabhakar, Health officer Dr RR Reddy, Additional Fire officer Sri Hemanth Reddy, DyEOs Sri Balaji, Sri Nagaraj, Sri Selvam, AVSOs Sri Gangraju, Sri Veerababu, Sri Bhavana Kumar, Sri Nageswar Rao and Sri Venkataramana and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

నిఘా మ‌రియు భ‌ద్ర‌తా విభాగంలో ఆయుధ‌పూజ‌

తిరుమ‌ల‌, 2020 అక్టోబ‌రు 30: తిరుమ‌ల‌లోని టిటిడి నిఘా మ‌రియు భ‌ద్ర‌తా విభాగంలో శుక్ర‌వారం ఆయుధ‌పూజ ఘ‌నంగా జ‌రిగింది. తిరుమ‌ల ఫ్లోర్ మిల్ ప్రాంగ‌ణంలో గ‌ల విజిలెన్స్ స్టోర్స్‌లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి పాల్గొన్నారు.

ముందుగా అర్చ‌కులు శ్రీ‌వారు, దుర్గామాత చిత్ర‌ప‌టాల‌కు ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. అనంత‌రం అద‌న‌పు ఈవో, సివిఎస్వో క‌లిసి అయుధాలు, ఇత‌ర భ‌ద్ర‌తా ప‌రిక‌రాల‌కు ఆయుధ‌పూజ చేశారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డ ప్ర‌ద‌ర్శ‌న‌గా ఏర్పాటుచేసిన భ‌ద్ర‌తా ప‌రిక‌రాల ప‌నితీరును అద‌న‌పు ఈవోకు భ‌ద్ర‌తా సిబ్బంది వివ‌రించారు.

ఈ సంద‌ర్భంగా టిటిడి సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి మాట్లాడుతూ నిఘా మ‌రియు భ‌ద్ర‌తా విభాగంలోని ఆయుధ‌సామ‌గ్రికి, ప‌రిక‌రాలకు ఆయుధ‌పూజ చేసిన‌ట్టు తెలిపారు. ఇందులో ప్ర‌ధానంగా బాంబుల నిర్వీర్యానికి, అగ్నిప్ర‌మాదాల నివార‌ణ‌కు‌, క‌మ్యూనికేష‌న్‌కు సంబంధించిన‌ ప‌రిక‌రాలు ఉన్నాయ‌ని వివ‌రించారు. నిఘా మ‌రియు భ‌ద్ర‌తా విభాగంలో దాదాపు 2800 మంది సిబ్బంది ఉన్నార‌ని, భ‌క్తుల భ‌ద్ర‌త కోసం వీరు ప్రాణాల‌ను సైతం లెక్క చేయ‌కుండా విధులు నిర్వ‌హిస్తున్నార‌ని తెలిపారు. ప‌విత్ర‌మైన తిరుమ‌ల‌లో నిత్యం అప్ర‌మ‌త్తంగా ఉంటూ భ‌ద్ర‌త ప‌రంగా భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా చూస్తున్నారని చెప్పారు. భ‌ద్ర‌తా సిబ్బందికి ఆయురారోగ్యాలు ప్ర‌సాదించి, చ‌క్క‌గా విధులు నిర్వ‌హించేలా చూడాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ ఆయుధ‌పూజ నిర్వ‌హించిన‌ట్టు తెలియ‌జేశారు.

సిబ్బందికి రివార్డులు

ఈ సంద‌ర్భంగా విధి నిర్వ‌హ‌ణ‌లో ఉత్త‌మ ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన 38 మంది నిఘా మ‌రియు భ‌ద్ర‌తా సిబ్బందికి అద‌న‌పు ఈవో, సివిఎస్వో చేతుల మీదుగా న‌గ‌దు రివార్డులు అంద‌జేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి అద‌న‌పు సివిఎస్వో శ్రీ శివ‌కుమార్‌రెడ్డి, విజివోలు శ్రీ మ‌నోహ‌ర్‌, శ్రీ ప్ర‌భాక‌ర్‌, ఆరోగ్య శాఖాధికారి డాక్ట‌ర్ ఆర్ఆర్‌.రెడ్డి, అదనపు ఫైర్ ఆఫీసర్ శ్రీ హేమంత్ రెడ్డి, డెప్యూటీ ఈవోలు శ్రీ బాలాజి, శ్రీ నాగ‌రాజ‌, శ్రీ సెల్వం, ఎవిఎస్వోలు శ్రీ గంగ‌రాజు, శ్రీ వీర‌బాబు, శ్రీ భావ‌న‌కుమార్‌, శ్రీ నాగేశ్వ‌ర‌రావు, శ్రీ వెంక‌ట‌ర‌మ‌ణ‌ త‌దిత‌రులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.