AYUDHA PUJA HELD _ త‌రిగొండ వెంగ‌మాంబ అన్న‌ప్ర‌సాదం కాంప్లెక్స్‌లో ఆయుధపూజ

TIRUMALA, 09 NOVEMBER 2023: The Ayudha Puja was held in Matrusri Tarigonda Vengamamba Annaprasadam Complex(MTVAC) in Tirumala on Thursday which was attended by TTD EO Sri AV Dharma Reddy.

 

Special Pujas were performed to the portraits of Sri Padmavathi Venkateswara amidst chanting of Vedic Mantras. Later Pujas were also performed to the Annaprasadam making huge machineries, utensils etc.

 

DyEO Sri Rajendra, DyEO KKC Sri Selvam, Health Officer Dr Sridevi, VGO Sri Nanda Kishore, Catering Special Officer Sri Shastry, AEO Sri Srinivas, other office staff, catering staff, Srivari Sevaks were also present.

 

Later Prasadams were distributed on the occasion.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

త‌రిగొండ వెంగ‌మాంబ అన్న‌ప్ర‌సాదం కాంప్లెక్స్‌లో ఆయుధపూజ

తిరుమ‌ల‌, 2023 న‌వంబ‌రు 09: తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్‌లో గురువారం ఆయుధ పూజ జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి పాల్గొన్నారు.

ముందుగా వేద మంత్రోచ్ఛారణ మధ్య శ్రీ పద్మావతి, శ్రీ‌ వేంకటేశ్వరుని చిత్రపటాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నప్రసాదాల త‌యారీకి వినియోగించే యంత్రాలు, పాత్రలకు పూజలు చేశారు. అనంతరం ప్రసాదాలు పంపిణీ చేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో అన్న‌ప్ర‌సాదం డెప్యూటీ ఈవో శ్రీ రాజేంద్ర, క‌ల్యాణ‌క‌ట్ట డెప్యూటీ ఈవో శ్రీ సెల్వం, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ శ్రీదేవి, విజివో శ్రీ నందకిషోర్, క్యాటరింగ్ ప్ర‌త్యేకాధికారి శ్రీ శాస్త్రి, ఏఈవో శ్రీ శ్రీనివాస్, ఇతర కార్యాలయ సిబ్బంది, క్యాటరింగ్ సిబ్బంది, శ్రీవారి సేవకులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.