“AYUDHAPURUSHA” RENDERED “AVABHRIDA SNANAM” _ వైభవోపేతంగా చక్రధారుడి చక్రస్నానం

TIRUMALA BRAHMOTSAVAMS CONCLUDES

 LAKHS TAKES BATH IN SWAMI PUSHKARINI

Tirumala, 8 Oct. 19:The anthropomorphic form of Lord, Sri Sudarshana Chakkrattalwar was given the celestial bath with which the annual nine-day brahmotsavams culminated on Tuesday in Tirumala in a grand manner.

Earlier the Ayudhapurusha (Sudarshana Chakram) was taken on a celestial procession and rendered special pujas before placed adjacent to the processional deities of Sri Malayappa Swamy, Sridevi and Bhudevi on a special platform placed at Varaha Swamy temple. The aromatic bath with different ingredients including milk, curd, honey, turmeric and coconut water has been performed to the deities amidst the chanting of vedic hymns by the vedic scholars. 

IMPORTANCE OF SUDHARSHANA CHAKRATTALWAR

According to Vedic scriptures, Sudarshana Chakkra, the 108 serrated sharp edged weapon used by Lord Maha Vishnu for the ultimate destruction of the evil forces. In sanskrit “Su” means auspicious and “Darshan” means vision. So Sudarshana provides positive vibrations by destroying negative energies and protects the mankind. Hence, taking celestial bath in the sacred waters of Swami Pushkarini on the day of Chakrasnanam is considered to be auspicious by the devotees.

SINGAPORE ORCHIDS AND AUSTRALIAN ORANGES PROVIDE FEEL GOOD LOOK TO THE VARAHA PUSHKARINI MANDAPAM

For the first time, the Garden Wing of TTD has come out with the concept of erecting floral and fruity pandal decoration for Snapana Tirumanjanam fete on the occasion of Chakrasnanam at Varaha Pushkarini on Tuesday morning.

When the Australian Oranges provided visual treat, the Singaporean Orchids added colour quotient to the setting giving an enhanced look to the celestial fete. 

CELESTIAL DIP PERFORMED

After the hour long Snapana Tirumanjanam to the deities, the Sudarshana Chakkrattalwar was brought to the Swamy Pushkarini and given sacred dip. Simultaneously all the pilgrims have also taken a celestial dip in the holy waters and the entire Hills reverberated to the chants of “Govinda Govinda”.

CHAIRMAN THANKS ALL

TTD Chairman Sri YV Subba Reddy thanked every employee of TTD, vigilance, police, Srivari Sevakulu, Scouts, other wings who volunteered towards the successful conduct of annual brahmotsavams and above all the pilgrims who co-operated with TTD towards an incident-free brahmotsavams.

He said, under the instructions of Honourable CM of AP, Sri YS Jagan Mohan Reddy, the priority has been given to the common pilgrims both in providing Mula Virat Darshan and Vahana Darshan. 

The elaborate arrangements made by all wings of TTD under the instructions of EO Sri Anilkumar Singhal and in the supervision of Additional EO Sri AV Dharma Reddy, JEO Sri P Basant Kumar and CVSO Sri Gopinath Jatti. With the benign blessings of Sri Venkateswara Swamy, the nine-day mega religious event passed off in a smooth manner, he added.

Hon’ble CJ of High Court of Andhra Pradesh Justice Jithendra Kumar Maheswari along with family members, DIG of Police Sri Kranthi Rana Tata, CVSO Sri Gopinath Jatti, ACVO Sivakumar Redy, Temple Dy EO Sri Haridranath, Peishkar Sri Lokanadham and others took part

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

వైభవోపేతంగా చక్రధారుడి చక్రస్నానం

తిరుమల, 2019 అక్టోబరు 08:   శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన మంగ‌ళ‌వారం ఉదయం చక్రస్నానం వైభవంగా జరిగింది. విశేష సంఖ్యలో భక్తులు విచ్చేసి శ్రీవారి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు.

అంతకుముందు తెల్లవారుజామున 3.00 నుండి 6.00 గంటల వరకు స్వామివారికి పల్లకీ ఉత్సవం వైభవంగా జరిగింది.  ఉదయం 6.00 నుంచి 9.00 గంటల నడుమ శ్రీ భూవరాహస్వామి ఆలయం ముఖ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపనతిరుమంజనం వైభవంగా నిర్వహించారు.
 
ఇందులో ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం, ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, రాజోపచారం నిర్వహించారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు. వీటిని శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారణలతో వైఖానస ఆగమయుక్తంగా స్నపనం నిర్వహించారు.

 ఈ సందర్భంగా ఉపనిషత్తు మంత్రములు, దశశాంతి మంత్రములు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, విష్ణుసూక్తం వంటి పంచసూక్త మంత్రములు, దివ్యప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానము చేసే వేదాలను టిటిడి వేదపారాయణదారులు పారాయణం  చేశారు. అభిషేకానంతరం వివిధ పాశురాలను శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యంగార్‌, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ్యంగార్లు  పఠించారు. ఈ వేడుకలో ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమ జాతి పుష్ప మాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు.

 తొమ్మిదిరోజుల ఉత్సవాలలో జరిగిన అన్ని సేవలూ సఫలమై – లోకం క్షేమంగా ఉండడానికీ, భక్తులు సుఖశాంతుల్తో ఉండడానికీ – చక్రస్నానం నిర్వహించారు. ఉత్సవాలు ఒక యజ్ఞమే కనుక – యజ్ఞాంతంలో అవభృథస్నానం’ చేస్తారు. యజ్ఞనిర్వహణంలో జరిగిన చిన్నచిన్న లోపాలవల్ల ఏర్పడే దుష్పరిణామాలు తొలగి, అన్నీ సంపూర్ణ ఫలాలు చేకూరడంకోసం చేసే దీక్షాంతస్నానం అవభృథం.

 చక్రస్నానం (అవభృథం)లో శ్రీవారి సుదర్శనచక్రంకు (చక్రత్తాళ్వార్‌కు) పుష్కరిణిలో స్నానం నిర్వహించే ముందు శ్రీభూసమేతమలయప్పమూర్తికి ‘స్నపన తిరుమంజనం’ నిర్వహించారు. తర్వాత సుదర్శన చక్రాన్ని పవిత్ర పుష్కరిణీజలంలో ముంచి, స్నానం చేయించారు. ఆ దివ్యాయుధ స్పర్శవల్ల  పవిత్రమైన పుష్కరిణీజలంలో భక్తసమూహం కూడా అదే సమయంలో స్నానం చేశారు. ఇందువల్ల ఈ ఉత్సవాలు చేసినవారికి, చేయించినవారికి, ఇందుకు సహకరించినవారికీ, దర్శించిన వారికీ – అందరికీ ఈ ఉత్సవయజ్ఞఫలం లభిస్తుంది.

చక్రస్నానంనాటి సాయంకాలం ధ్వజావరోహణం యథావిధిగా చేస్తారు. ఇంతటితో బ్రహ్మోత్సవయజ్ఞం మంగళాంతం అవుతుంది.

ఎవరైతే బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకొంటారో వారు సమస్త పాపవిముక్తులై, ధనధాన్య సమృద్ధితో తులతూగుతారు. విషమృత్యు నాశనం, రాజ్యపదవులవంటి సకల ఐహిక శ్రేయస్సులు పొందుతారు. పరాంతకాలం వరకూ ఎటువంటి జనన, మరణ వికారములు లేకుండా సర్వలోకాలలో యథేచ్ఛగా విహరిస్తూ బ్రహ్మానందాన్ని పొంది శాశ్వతమైన విష్ణులోకాన్ని చేరుకొంటారు.

       అనంతరం సాయంత్రం 5.00 నుండి 7.00 గంటల మధ్య బంగారు తిరుచ్చి ఉత్సవం జరుగనుంది. రాత్రి 7.00 నుండి 9.00 గంటల మధ్య ధ్వజావరోహణంతో శ్రీ వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగియనున్నాయి.

 ఈ కార్యక్రమాల్లో ఏ. పి. రాష్ట్ర హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ జితేంద్ర కుమార్ మ‌హేశ్వ‌రి, టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి, కార్యనిర్వహణాధికారి శ్రీఅనిల్‌కుమార్‌ సింఘాల్‌, అద‌న‌పు ఈవో శ్రీ ఎ.వి.ధ‌ర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ గోపినాధ్ జెట్టి, అద‌న‌పు సివిఎస్వో శ్రీ శివ‌కుమార్ రెడ్డి, ప‌లువురు ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యులు, ఇతర అధికార ప్రముఖులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.