AYURVEDA AND HOMEOPATHY SHOWED THE WORLD THE GREATNESS OF INDIAN TRADITIONAL MEDICINE-TTD EO _ ఆయుర్వేద వైద్యం భారతదేశం సొంతం  : తితిదే ఈవో శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం

TIRUPATI, MARCH 20:  TTD EO Sri LV Subramanyam advocated that the Indian Ayurveda and Homeopathy showed the world the par excellence standards of traditional Indian Medicine.
 
Address the Academic Awards ceremony at SV Ayurvedic College in Tirupati on Wednesday evening, the Executive Officer asked the First batch PG students who are successfully passing out of the college to dedicate themselves in the propagation of richness of Ayurvedic and Homeopathy medicines by offering commendable services to the society.
 
“You are fortunate to have passed out from this great institution that is being run by the blessings of Lord Venkateswara. So give the fruits of the knowledge that was acquired by you in the service of humanity”, he maintained.
 
Later the EO has given away the certificates to the 32 students of PG First batch who passed out from the College successfully.
 
Tirupati JEO Sri P Venkatrami Reddy, Ayurvedic College Principal Dr Rajaiah, Superintendent Dr Parvathi and other faculty members were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
 

ఆయుర్వేద వైద్యం భారతదేశం సొంతం  : తితిదే ఈవో శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం

తిరుపతి, మార్చి 20, 2013: ప్రాచీనమైన ఆయుర్వేద వైద్యం భారతదేశం సొంతమని, ఇప్పటికీ దీనికి ఏమాత్రం ఆదరణ తగ్గలేదని తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం అన్నారు. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ఆయుర్వేద కళాశాల మొదటి బ్యాచ్‌ పిజి విద్యార్థులకు బుధవారం పట్టాల ప్రదానోత్సవం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తితిదే ఈవో ప్రసంగిస్తూ ఇంగ్లీషు వైద్యం కంటే కొన్ని వందల ఏళ్ల ముందు ఆయుర్వేద వైద్యం భారతీయులకు అందుబాటులోకి వచ్చిందన్నారు. ప్రస్తుతం ఇతర దేశస్తులు సైతం భారతదేశానికి వచ్చి ఆయుర్వేద వైద్యా విధానాలతో అనేక వ్యాధుల నుండి ఉపశమనం పొందుతున్నారని వివరించారు. ఇలాంటి విశిష్టమైన వైద్య విధానాన్ని శ్రీ వేంకటేశ్వరుని సన్నిధిలో అభ్యసిస్తున్న విద్యార్థులు అదృష్టవంతులన్నారు. ఇక్కడ చదువు పూర్తి చేసుకున్న విద్యార్థులు ఈ వైద్యాన్ని పది మందికీ పంచి ఆరోగ్యమైన సమాజ నిర్మాణానికి పాటుపడాలని ఆయన పిలుపునిచ్చారు.

అనంతరం ఈవో చేతుల మీదుగా పిజి విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. ఆరు సబ్జెక్టులకు చెందిన మొత్తం 32 మంది విద్యార్థులు పట్టాలు అందుకున్నారు.
ఈ కార్యక్రమంలో తితిదే తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పి.వెంకట్రామిరెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రాజయ్య, సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పార్వతిదేవి, అకడమిక్‌ వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జి.పి.రామిరెడ్డి, ఇతర విభాగాల అధ్యాపకులు దత్తాత్రేయరావు, శంకర్‌బాబు, పరాంకుశరావు తదితరులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.