BAN ON TWO-WHEELERS IN VIEW OF GARUDA SEVA ON OCTOBER 8 _ అక్టోబరు 8న గరుడ సేవ దృష్ట్యా తిరుమలకు ద్విచక్ర వాహనాలు నిషేధం
TIRUMALA, 02 SEPTEMBER 2024: Keeping in view the anticipated heavy influx of devotees on the day of Garuda Seva during the ensuing annual brahmotsavams, TTD has banned the movement of two-wheelers on both the Ghat Roads as a regular practice for the safety of the pilgrims.
This year the annual brahmotsavams at Tirumala are scheduled from October 4 to 12 with the most important Garuda Seva on October 8. As such no two-wheelers will be allowed to ply on the Ghat road from 9pm of October 7 till 6am of October 9.
The devotees are requested to make note of this and co-operate with TTD.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
అక్టోబరు 8న గరుడ సేవ దృష్ట్యా తిరుమలకు ద్విచక్ర వాహనాలు నిషేధం
తిరుమల, 2024 సెప్టెంబరు 02: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో శ్రీవారికి అత్యంత ప్రియమైన గరుడసేవ రోజున భారీగా విచ్చేసే భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, అక్టోబరు 8న టీటీడీ రెండు ఘాట్ రోడ్‌లలో ద్విచక్ర వాహనాల రాకపోకలను నిషేధించింది.
ఈ సంవత్సరం తిరుమలలో వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబరు 4 నుండి 12 వరకు అత్యంత వైభవంగా జరగనున్నాయి. అక్టోబర్ 8న ముఖ్యమైన గరుడ సేవ నిర్వహించనున్నారు. కాబట్టి అక్టోబర్ 7న రాత్రి 9 గంటల నుండి అక్టోబర్ 9 ఉదయం 6 గంటల వరకు ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాలు అనుమతించబడవు.
కావున భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాలని కోరుతోంది.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.