BASHYA PARAYANAM ON SEP 7 AT SKVST _ సెప్టెంబరు 7న శ్రీనివాసమంగాపురంలో భాష్య పారాయణం

Tirupati, 04 September 2022: As part of the Vamana Jayanti celebrations TTD is organising Bashya Parayanam at Sri Kalyana Venkateswara Swamy  templen in Srinivasa Mangapuram on September 7.

 

Twelve Vedic pundits proficient in Sri Shankaracharya’s Advaitam, Sri Ramanujacharya’s Vishistadvaitam and Sri Madhwacharya’s Dwaitam and Lakshmi Vishistadvaitam of Vaikhanasa tradition will be render respective Mantras seeking global well-being.

 

TTD has commenced a new practice and tradition of conducting the Parayanam of Bashya in consonance with Upanishad Mantras.

 

TTD Agama Advisor  Acharya Vedantam  Vishnu Bhattacharyulu will function as convenor of the program conducted under the aegis of the HDPP wing of TTD.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

సెప్టెంబరు 7న శ్రీనివాసమంగాపురంలో భాష్య పారాయణం

తిరుప‌తి, 2022 సెప్టెంబ‌రు 04: వామన జయంతిని పురస్కరించుకుని సెప్టెంబర్ 7వ తేదీన శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో భాష్య పారాయణం జరగనుంది.

శ్రీ శంకరాచార్యులవారి అద్వైతం, శ్రీ రామానుజాచార్యుల వారి విశిష్టాద్వైతం, శ్రీ మధ్వాచార్యుల వారి ద్వైతం, వైఖానస సాంప్రదాయ లక్ష్మీ విశిష్టాద్వైతం భాష్యాలను 12 మంది ఆయా శాస్త్ర పండితులు లోక సంక్షేమం కోసం పారాయణం చేయనున్నారు. ఉపనిషత్ మంత్రాల సమన్వయంతో కూడిన భాష్యాలను పారాయణం చేయడం ద్వారా టిటిడి మంచి సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది.

టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో జరుగనున్న ఈ భాష్య పారాయణ కార్యక్రమాలకు టీటీడీ ఆగమ సలహాదారు ఆచార్య వేదాంతం విష్ణుభట్టాచార్యులు కన్వీనర్ గా వ్యవహరించనున్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.