BEHAVE FRIENDLY WITH DEVOTEES _ విధుల్లో అలసత్వం వద్దు

EO TO TTD SECURITY PERSONAL

 

Tirumala, 26 September 2022:   TTD EO Sri AV Dharma Reddy on Monday advised the TTD security personnel to be extra active during next nine days of Srivari Brahmotsavam and be patient and friendly with devotees.

 

Addressing a gathering of the TTD vigilance staff at Asthana Mandapam, TTD EO exhorted them to coordinate with the police department and function with discipline to bring laurels to TTD.

 

He urged them to be always vigilant on the issue of devotees safety.

 

CVSO Sri Narasimha Kishore,VGO Sri Bali Reddy, AVSOs were present.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

విధుల్లో అలసత్వం వద్దు
భక్తులతో స్నేహ పూర్వకంగా ప్రవర్తించండి

– టీటీడీ సెక్యూరిటీ సిబ్బందికి ఈవో శ్రీ ఎ వి ధర్మారెడ్డి సూచన

తిరుమల 26 సెప్టెంబరు 2022: శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజులు విధుల్లో ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించవద్దని టీటీడీ ఈవో శ్రీ ఎ వి ధర్మారెడ్డి టీటీడీ భద్రతా సిబ్బందికి సూచించారు. లక్షలాదిగా వచ్చే భక్తులతో సహనంతో , స్నేహ పూర్వకంగా ప్రవర్తించాలని చెప్పారు.

తిరుమల ఆస్థాన మండపంలో సోమవారం ఆయన టీటీడీ భద్రతా సిబ్బందితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శ్రీ ధర్మారెడ్డి మాట్లాడుతూ, పోలీసు శాఖతో సమన్వయం చేసుకోవాలన్నారు. క్రమశిక్షణ తో పని చేసి టీటీడీ కి మరింత మంచి పేరు తేవాలని సూచించారు. భక్తుల భద్రత విషయంలో కూడా నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు.

సివి ఎస్వో శ్రీ నరసింహ కిషోర్, విజివో శ్రీ బాలి రెడ్డి, ఏవీ ఎస్వోలు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది