BHAGAVAT GITA AKHANDA PARAYANAM HELD _ నాద‌నీరాజ‌నం వేదిక‌పై భ‌గ‌వ‌ద్గీత అఖండ ‌పారాయ‌ణం

Tirumala, 25 Dec. 20: The Akhanda Parayanam of Srimad Bhagavat Gita held at the Nada Neerajana Mandapam in Tirumala on Friday on the auspicious occasion of Gita Jayanthi coupled with Vaikuntha Ekadasi.

The programme lasted for nearly four hours starting at 6am. The Vedic scholars presented the 700 shlokas from all the 18 chapters. The pilgrims took part in this Akhanda Parayanam with utmost devotion.

Earlier, TTD Asthana Vidhwan Dr G Balakrishna Prasad and his team presented a melodious Sankeertan on the conversation between Sri Krishnarjua and concluded with Krishnam Vande Jagadgurm Bhajan.

Additional EO Sri AV Dharma Reddy, National Sanskrit Varsity VC Sri Muralidhara Sharma, Annamacharya Project Director Sri Dakshinamurthy, Dharmagiri Veda Vignana Kendram Principal Sri KSS Avadhani, CEO SVBC Sri Suresh Kumar, Reception Deputy EO Sri Balaji and many Vedic experts from TTD institutions, Sanskrit Varsity, devotees participated.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDS, TIRUPATI

నాద‌నీరాజ‌నం వేదిక‌పై భ‌గ‌వ‌ద్గీత అఖండ ‌పారాయ‌ణం

తిరుమల, 2020 డిసెంబ‌రు 25: వైకుంఠ ఏకాద‌శితోపాటు విశేష‌మైన గీతాజ‌యంతిని పుర‌స్క‌రించుకుని శుక్ర‌వారం నాడు తిరుమ‌ల‌లోని నాద‌నీరాజ‌నం వేదిక‌పై భ‌గ‌వ‌ద్గీత అఖండ పారాయ‌ణం జ‌రిగింది.

ఉద‌యం 6 గంట‌ల నుండి దాదాపు 4 గంట‌ల పాటు ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది. భ‌గ‌వ‌ద్గీత‌లోని 18 అధ్యాయాల్లో గ‌ల 700 శ్లోకాల‌ను వేద‌పండితులు పారాయ‌ణం చేశారు. భ‌క్తులు ఎంతో భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

అంత‌కుముందు టిటిడి ఆస్థాన విద్వాంసులు శ్రీ గరిమెళ్ల బాల‌కృష్ణ‌ప్ర‌సాద్ అన్న‌మ‌య్య సంకీర్త‌న‌ల‌ను వీనుల‌విందుగా ఆల‌పించారు. శ్రీ కృష్ణార్జున వ్యాఖ్యానం చేశారు. కృష్ణం వందే జ‌గ‌ద్గురుమ్ భ‌జ‌నతో ఈ కార్య‌క్ర‌మం ముగిసింది.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, కేంద్రీయ సంస్కృత విశ్వ‌విద్యాల‌యం విసి ఆచార్య ముర‌ళీధ‌ర శ‌ర్మ‌, అన్న‌మాచార్య ప్రాజెక్టు సంచాల‌కులు ఆచార్య ద‌క్షిణామూర్తి, ధ‌ర్మగిరి వేద విజ్ఞాన‌పీఠం ప్రిన్సిపాల్ శ్రీ కెఎస్ఎస్‌.అవ‌ధాని, ఎస్వీబీసీ సిఈవో శ్రీ సురేష్ కుమార్‌, రిసెప్ష‌న్ డెప్యూటీ ఈవో శ్రీ బాలాజి, వేద పండితులు, భ‌క్తులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.