DONATIONS POUR IN FOR TTD ON V-DAY _ టిటిడికి రూ.2.54 కోట్లు విరాళం

Tirumala, 25 Dec. 20:  Donations pour in for various trusts of TTD on the auspicious day of Vaikuntha Ekadasi in Tirumala on Friday.

TTD Trust Board Member from Tamilnadu Sri Kumaraguru has donated Rs.one crore towards the construction of Sri Venkateswara Swamy temple in his constitution at Ulundurpeta.

Sri Indra Kumar from Hyderabad, a philanthropist has donated Rs.1.08crores to Vidyadana and Pranadana Trusts of TTD with 54lakhs each for these trusts.

Both the donors presented the DD and handed over them to TTD Chairman Sri YV Subba Reddy and EO Dr KS Jawahar Reddy in Srivari Temple.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDS, TIRUPATI

టిటిడికి రూ.2.54 కోట్లు విరాళం

తిరుమల, 2020 డిసెంబ‌రు 25: వైకుంఠ ఏకాద‌శి నాడు శుక్ర‌వారం టిటిడికి రూ.2.54 కోట్లు విరాళంగా అందాయి. టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యులు శ్రీ కుమార‌గురు త‌న సొంత ప్రాంత‌మైన త‌మిళ‌నాడు రాష్ట్రం ఊలందూరుపేట‌లో శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌య నిర్మాణం కోసం  ఒక కోటి రూపాయ‌లు విరాళంగా అందించారు.

అదేవిధంగా, హైద‌రాబాద్‌కు చెందిన శ్రీ ఇంద్ర‌కుమార్ అనే భ‌క్తుడు టిటిడి విద్యాదాన ట్ర‌స్టుకు రూ.1.08 కోట్లు, ప్రాణ‌దాన ట్ర‌స్టుకు రూ.54 ల‌క్ష‌లు విరాళంగా అందించారు. ఈ మేర‌కు దాత‌లు విరాళాల డిడిల‌ను శ్రీ‌వారి ఆల‌యంలో టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డికి అంద‌జేశారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.